For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prakash Rajకి మరో షాక్.. మీటింగులు ఎందుకు.. చావబోయి బతికాం అంటూ వీడియో రిలీజ్ చేసిన బండ్ల!

  |

  ఎన్నికల డేట్ రాకముందు నుంచే వేడెక్కిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు డేట్ కూడా ప్రకటన కావడంతో మరింత రాజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పెద్ద గ్రూపులుగా విడిపోయి రంగంలోకి దిగగా మరో ఇద్దరు ముగ్గురు సభ్యులు స్వతంత్రంగా అధ్యక్ష బరిలో దిగుతున్నామని ప్రకటించారు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం విందు రాజకీయానికి తెర దించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన మీద బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  రచ్చ రచ్చ

  రచ్చ రచ్చ

  గత కొంతకాలం నుంచి మా ఎన్నికల వ్యవహారాల గురించి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను 'సినిమా బిడ్డల ప్యానల్' ప్రకటించారు. అయితే అందులో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నామని బరిలోకి దిగిన జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉండటం అందరికీ షాక్ ఇచ్చింది.

  జీవిత దెబ్బకు ఔట్

  జీవిత దెబ్బకు ఔట్

  ఈ క్రమంలోనే జీవిత ఎంట్రీతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ బయటకు రావడం, స్వతంత్రంగా జీవిత మీద పోటీ చేస్తానని చెప్పడం, జీవిత రాజశేఖర్ ఇష్టం లేదని చెబుతూ చిరంజీవి కుటుంబ వ్యవహారాలు గుర్తు చేస్తూ కామెంట్ చేయడం మరో వివాదానికి తెర తీసింది. జీవిత రాజశేఖర్ కూడా బండ్ల గణేష్ కామెంట్స్ గట్టిగానే సమాధానం చెప్పిందనుకోండి అది వేరే విషయం.

   భోజన రాజకీయం

  భోజన రాజకీయం

  ఇక మొన్నామధ్య నరేష్ తనకు మద్దతు ఇచ్చే మెంబర్స్‌తో ఒక ప్రయివేట్ పార్టీ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా తన ప్యానల్ మెంబర్స్‌తో విందు ఏర్పాటు చేశారు. "ప్రియమైన సిని"మా" బిడ్డలకు... కలిసి మాట్లాడుకుందాం.. అభిప్రాయాల్ని పంచుకుందాం... ప్రతిష్ఠని, పటిష్టతని పెంచే దిశగా...మన లక్ష్యాలు మాట్లాడుకుందాం... మాట్లాడుకున్నాక సహపంక్తి భోజనం చేద్దాం'' అంటూ సభ్యులు అందరికీ ఓ ఇన్విటేషన్ ను పంపారు.

  బండ్ల గణేష్ ఘాటుగా

  అయితే ఇప్పుడు దీనిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ఒక వీడియో విడుదల చేశారు . ప్రకాష్ రాజ్ ఇలా విందు రాజకీయాలు చేయడం పై బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. ఈ వీడియోలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. లంచ్‌లు డిన్నర్ల పేరుతో మా సభ్యులను ఒక చోట చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దయచేసి మా కళాకారులను విందులు , సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు.. ఎందుకంటే గత రెండేళ్లలో అందరం కరోనా భయంతో బ్రతుకుతున్నాం.'' అని పేర్కొన్నారు.

  Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
  చావబోయి బతికాం

  చావబోయి బతికాం

  నాతో సహా చాలా మంది చావు అంచుల దాకా వెళ్లివచ్చారు, ఓటు కావాలంటే ఫోన్‌ చేసి, మీరు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పండి. అంతే కానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి మా ప్రాణాలతో చెలగాటమాడొద్దు.. అంటూ పేర్కొన్నారు. ఇక ఈ రోజు అంటే సెప్టెంబర్ 12 ఆదివారం రోజున జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఈ మీటింగ్ ఉంటుందని ఆహ్వాన పత్రికలో ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మీటింగ్ సంచలనంగా మారింది.

  English summary
  Actor bandla Ganesh made some sensational comments on Prakash raj over meetings for MAA elections.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X