అక్కడ కొట్టండి.. కానీ నా కడుపు మీద కొట్టకండి.. ఆ విషయంలో బండ్ల గణేష్ ఆవేదన
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తరువాత ఒక స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగొందిన విషయం తెలిసిందే. ఇక రాజకీయాల్లో కూడా ఒక చిన్న అడుగు వేసిన బండ్ల గణేష్ అక్కడ తగలిన షాక్ కి మళ్ళీ యూ టర్న్ తీసుకున్నాడు. రాజకీయాలకు స్వస్థి చెప్పి తన బిజినెస్ తో బిజీ అయ్యాడు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఒక ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సడన్ గా బండ్ల గణేష్ ఒక షాకింగ్ ట్వీట్ చేశారు.

ఇబ్బంది కలిగించిన తప్పుడు వార్తలు
ఇండస్ట్రీలో సినీ తారాలపై రెగ్యులర్ గా ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కొందరు వాటిని లైట్ తీసుకుంటారు. మరికొందరు వెంటనే స్పందించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇక బండ్ల గణేష్ కూడా అదే తరహాలో తనపై ఎప్పుడు రూమర్స్ వైరల్ అయినా కూడా వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక రీసెంట్ గా మరికొన్ని రూమర్స్ బండ్ల గణేష్ కి బాగా ఇబ్బందిని కలిగించాయని తెలుస్తోంది.

దయ చేసి కడుపు మీద కొట్టకండి
"వీపుమీద కొట్టండి .కానీ నీ దయ చేసి కడుపు మీద కొట్టకండి ......ఇది నా విన్నపం .నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన" అంటూ ఈ సీనియర్ నిర్మాత చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ట్వీట్ పై కూడా అనేక రకాల కథనాలు హాట్ టాపిక్ గా మారాయి.

ఎందుకు ఈ విధంగా ట్వీట్ చేశాడంటే..
బండ్ల గణేష్ ఎందుకు ఈ విధంగా ట్వీట్ చేశాడు అనే సందేహంలోకి వెళితే.. ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ గురించి వస్తున్న కొన్ని తప్పుడు వార్తలపై బండ్ల గణేష్ కి కొంత బాధ కలిగించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఒప్పుకోలేదని పవన్ ఎదో సరదాగా చూద్దాంలే.. అన్నందుకు బండ్ల గణేష్ తొందరపడి ట్వీట్ చేశాడని కూడా కథనాలు వెలువడ్డాయి.
Recommended Video

లేని పోనీ అనుమానాలను కలిగించకూడదని..
అదే విధంగా సినిమాకు సంబంధించిన డైరెక్టర్ విషయంలో కూడా కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు పూరి జగన్నాథ్, కిషోర్ కుమార్ పార్ధసాని వంటి దర్శకులు ఆ లిస్ట్ లో ఉన్నట్లు గాసిప్స్ కూడా వచ్చాయి. ఇక ఈ కథనాలపై కాస్త కలత చెందిన బండ్ల గణేష్ ఒక ప్రాజెక్ట్ పై లేని పోనీ అనుమానాలను కలిగించకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ విధంగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











