చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో అలాంటి సినిమాలు.. బండ్ల గణేశ్ చివరి కోరిక తీరేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. తనకు తాను పవన్ కు భక్తుడిగా ప్రకటించుకున్న బండ్ల గణేష్ 'ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. దేవరా' అంటూ అనేక సందర్భాల్లో తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆ ఏడు కొండలవాడికి అన్నమయ్యలా, శివుడికి భక్త కన్నప్పలా, రాముడికి హనుమంతుడిలా తాను కళ్యాణ్‌కి పరమ భక్తుడినని తనని తాను ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకుంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారు?

తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేశ్... తన భవిష్యత్ ప్రణాళికలు, స్టార్ హీరోలతో సినిమాలపై తన కోరికలు, అలాగే ఇండస్ట్రీ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన బ్యానర్ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. "నేను పెట్టుకున్న కొత్త బ్యానర్ పెద్దది కాదు... చిన్న బ్యానర్. మా అమ్మాయి పేరుతో ఆ బ్యానర్‌ను ప్రారంభించాను. ETV Win తో కలిసి మూడు నాలుగు చిన్న సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. నాలుగు నుంచి ఐదు కోట్ల బడ్జెట్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను" అని చెప్పారు. చిన్న సినిమాల ద్వారానే మంచి కథలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానని వివరించారు.

Bandla Ganesh Shocking Comments on Pawan Kalyan Chiranjeevi amp amp Tollywood Future

అయితే తన పాత బ్యానర్ 'పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్' గురించి మాట్లాడుతూ బండ్ల గణేశ్ ఒక పెద్ద కోరికను బయటపెట్టారు. "మళ్లీ నేను పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమా చేస్తే... అది ఒక స్పెషల్ మూవీ అయి ఉండాలి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)గారితో ఒక్క సినిమా తీసి... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఉలిక్కిపడేలా చేయాలి. అలాంటి భారీ హిట్ ఇచ్చి ఆ బ్యానర్‌ను ఆపేయాలని నా కోరిక" అంటూ సెన్సేషనల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో సినిమా ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్నకు కూడా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "ఆ విషయం దేవుడి చేతిలో ఉంది. ఏడుకొండల వాడు ఎప్పుడు ఆ అవకాశం ఇస్తాడో ఎదురు చూస్తున్నాను. మంచి దర్శకుడు, చి కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తాను. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలి. మళ్లీ 30 ఏళ్ల తర్వాత కూడా మా పిల్లలు గర్వంగా చెప్పుకునేలా ఉండాలి" అని తెలిపారు. ఈ సందర్భంగా తన గత హిట్ సినిమా గబ్బర్ సింగ్ ను గుర్తు చేసుకున్నారు. "ఈ రోజు కూడా 'గబ్బర్ సింగ్' పేరు వినిపిస్తూనే ఉంది. అలాంటి మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేయాలి. మరో 25-30 ఏళ్ల పాటు గుర్తుండే సినిమా చేయాలనేది నా డ్రీమ్" అని అన్నారు.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి కథల కొరత ఉందని బండ్ల గణేశ్ అభిప్రాయపడ్డారు. "అలాంటి బలమైన కథలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ ఇండస్ట్రీ ఏమవుతుందో నాకు భయం వేస్తోంది. ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో, ఏది ఫెయిల్ అవుతుందో అర్థం కావడం లేదు. మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు. రెండో రోజుకే సినిమాలు డౌన్ అవుతున్నాయి. ఇది ఒక పెద్ద మిస్టరీలా మారిపోయింది" అని ఆయన అన్నారు. "ఇండస్ట్రీలో ఏదో పెద్ద మార్పు జరుగుతోంది. ఇది సాధారణ పరిస్థితి కాదు. ఒక పెద్ద ట్రాన్సిషన్ స్టేజ్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. మొత్తం పరిస్థితి కాస్త ప్రమాదకరంగానే కనిపిస్తోంది. కానీ ఈ మార్పు తర్వాత మంచి రోజులు కూడా రావొచ్చు" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇలా బండ్ల గణేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్‌తో ఒక భారీ సినిమా చేసి బ్యానర్‌ను ముగించాలని ఆయన చెప్పడం, చిరంజీవితో బ్లాక్‌బస్టర్ ప్లాన్ చేయడం, అలాగే ఇండస్ట్రీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. బండ్ల గణేశ్ చివరి కోరిక తీరుతుందా? లేదా ? అనేది వేచి చూడాలి. ఈ టాపిక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X