పవన్ కళ్యాణ్ ప్లాప్ సినిమాపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ తో పాటు ఎక్కువగా అపజయాలు కూడా ఉన్నాయి. అయితే ప్లాప్ సినిమాల గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసే తదుపరి సినిమాపై ఎప్పుడు ఆ ఎఫెక్ట్ పడదు. ఇక పవన్ డిజాస్టర్స్ లిస్ట్ లో తీన్ మార్ సినిమా ఒకటి. హిందీ సూపర్ హిట్ 'లవ్ ఆజ్ కల్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అప్పటి స్టార్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఇక సినిమాను నిర్మించిన బండ్ల గణేష్ చాలా రోజుల తరువాత సినిమాపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు. సినిమా విడుదలై నేటికి 9ఏళ్ళు పూర్తి కావడంతో ఆ సినిమాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

Bandla ganesh shocking comments on pawan kalyan teen maar movie

ఈ సినిమా అనుకున్నంతగా విజయాన్ని సాదించకపోయినా తన కెరీర్ లో మరచిపోలేని ఒక మంచి సినిమా అని ట్వీట్ చేశాడు. ఇంకా ఏమన్నారంటే.. కొన్ని కారణాల వల్ల సినిమా సరిగ్గా ఆడకపోయినా త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి హృదయపూర్వక పాదాభివందనం అని కామెంట్ చేశారు.

అదే విధంగా సినిమాలో మనసుకు హత్తుకునే డైలాగ్స్ గురించి కూడా వివరణ ఇచ్చిన బండ్ల గణేష్ ఈ సినిమాకి మణిశర్మ అందించిన పాటలు ఎప్పటికి మరచిపోలేనివని అన్నారు. తీన్ మార్ సినిమా డిజాస్టర్ అయ్యిందని అప్పట్లో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో మరొక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అదే గబ్బర్ సింగ్. ఆ సినిమా తరువాత బండ్ల గణేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. జయపజయలతో సంబంధం లేకుండా మంచి నిర్మాతగా కొనసాగే ప్రయత్నం చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X