బండ్లగణేష్ సంచలన నిర్ణయం.. నా జీవితంలో అలా జరక్కూడదు.. గుడ్ బై అంటూ..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బండ్ల గణేష్ ఆ మధ్య రాజకీయాల్లో కూడా కొంత హడావుడి చేసిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాల వలన బండ్ల గణేష్ అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇంకా సోషల్ మీడియాలో కూడా ఆయనపై అనేక రకాలుగా ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో నిరంతరం చురుగ్గా కనిపించే బండ్లగణేష్ రీసెంట్ గా ఎవరూ ఊహించని విధమైన ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి తన జీవితంలో ఎలాంటి కాంట్రవర్సీకి గురవ్వడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతూ ఒక ట్వీట్ చేశాడు.

చేదు అనుభవం
నిర్మాత బండ్ల గణేష్ మొదట ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే అలా నటుడిగా మొదలైన అతని ప్రయాణం కమెడియన్ వైపుగా కూడా అడుగులు వేయించింది. సినిమా ప్రపంచంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆ తర్వాత నిర్మాతగా కూడా ప్రయత్నాలు చేశాడు. అయితే అక్కడ కూడా తనకి మొదట చేదు అనుభవం ఎదురైంది.

బ్యాడ్ లక్ ఏమిటో గాని..
పవన్ కళ్యాణ్ తో మొదట చేసిన తీన్మార్ సినిమా ఈ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత చేసినావ్ గబ్బర్ సింగ్ సినిమా మాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత గా కూడా గుర్తింపు అందుకున్నాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ అవ్వడంతో మిగతా హీరోలు కూడా అతనికి డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. స్టార్ దర్శకులు కూడా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అతని బ్యాడ్ లక్ ఏమిటో గాని సక్సెస్ ను ఎక్కువకాలం కొనసాగించలేకపోయాడు.

గుడ్ బై అంటూ..
అయితే హఠాత్తుగా బండ్లగణేష్ తన ట్విట్టర్ అకౌంట్ గుడ్ బై చెప్పబోతున్న ట్లు ట్వీట్ చేశాడు. త్వరలోనే ట్విట్టర్ ఎకౌంట్ గుడ్ బై చెప్పేస్తాను. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో కాంట్రవర్సీ లకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అతని ఫాలోవర్స్ ఏమైంది అంటూ అనేక రకాల ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ దేవర అని సంబోధించి విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఆయనతో సినిమా కూడా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్ ఇలా సడన్ గా ఎందుకు ట్వీట్ చేశారనేది హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

అదే ఆఖరి సినిమా..
ఇక నిర్మాతగా పన్నెండేళ్ల సినిమా కేరళ లో అతను కేవలం 8 సినిమాలను మాత్రమే నిర్మించాడు. ఇక 2017 లో పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమా తర్వాత బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మించింది లేదు ఆ తర్వాత రెండు మూడు కథలు విన్నప్పటికీ ఎందుకు ధైర్యంగా ముందడుగు వేయలేకపోయారు చిన్న సినిమాలు కూడా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ప్రయత్నాలు కూడా చర్చల దశలోనే క్యాన్సిల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











