చిచ్చు పెడుతున్న పవన్ వ్యాఖ్యలు.. సహనం కోల్పోతున్న బండ్ల గణేష్.. నోరు తెరిస్తే గుండె ఆగిపోయి చస్తావ్ అంటూ..
బండ్ల గణేష్ సోషల్ మీడియాలో మళ్ళీ హీటెక్కించే మాటలతో హాట్ టాపిక్ గా మారిపోయాడు. గతంలో తనపై ఎవరైనా చెడు వ్యాఖ్యలు చేస్తే కౌంటర్లు ఇస్తూ ఇచ్చిన బండ్ల గణేష్ ఈసారి మొట్టమొదటగా ఏకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాటలకు ఊహించిన విధంగా సీరియస్ అవుతూ ఉన్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ షోలో గబ్బర్ సింగ్ కు సంబంధించిన రెమ్యునరేషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఆ విషయంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఊహించిన విధంగా స్పందిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వివరాలలోకి వెళితే..

బాలయ్య షోలో అలా..
ఇటీవల పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఆ షోలో పవన్ కళ్యాణ్ తన జీవితంలోని ఎన్నో కాంట్రవర్సీ విషయాల గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా గబ్బర్ సింగ్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ బాలయ్య బాబు చేసిన ఒక ప్రశ్నకు ఆయన ఊహించిన విధంగా సమాధానం ఇచ్చారు.

రెమ్యునరేషన్ పై కామెంట్
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా సమాధానాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ విషయాలలో కూడా ఎదురైన ప్రశ్నకు అదే తరహాలో వివరణ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సినిమాకు పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ అందిందా అని బాలయ్య బాబు అడగగానే పాపం బండ్ల గణేష్ తను అనుకున్నంత ఇచ్చాడు అని నేను అనుకున్నంత ఇవ్వలేదు అని సరదాగా నవ్వుతూ వివరణ ఇచ్చాడు.

బండ్ల గణేష్ పాజిటివ్ రియాక్షన్
పవన్ కళ్యాణ్ ఆ విధంగా సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో పై బండ్ల గణేష్ కూడా మొదట చాలా పాజిటివ్ గానే స్పందించాడు. లవ్ యు బాస్.. పవన్ కళ్యాణ్ గారిది అంతులేని ప్రేమ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ వీడియోపై స్పందించారు.

నా విశ్వరూపం చూపిస్తా..
ఇక మరొక ట్వీట్ లో పవన్ కళ్యాణ్ కు విరుద్ధంగా ఉన్న వివరణకు బండ్ల గణేష్ ఊహించిన విధంగా రియాక్ట్ అయ్యాడు. 'ఇప్పుడు అర్థమైందా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు పవన్ కళ్యాణ్ ను ఎంత అభిమానించావో తెలుగు వారందరికీ తెలుసు. కానీ ఒక పాపులర్ షో అని కూడా చూడకుండా అలా మాట్లాడాడు.. అంటే ఆయన నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో తెలుస్తుంది.' అని ఒక పేరు లేని ట్విట్టర్ అకౌంట్ నుంచి వివరణ రావడంతో బాండ్ల గణేష్ దాన్ని రీట్వీట్ చేయడమే కాకుండా 'నా విశ్వరూపం కూడా చూపిస్తాను' అంటూ మరో సమాధానం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

పవన్ కళ్యాణ్ కు విరుద్ధంగా..
అయితే అంతకుముందు రోజే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తావని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు ఆయన నెక్స్ట్ సీఎం అని సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా బండ్ల గణేష్ నా విశ్వరూపం కూడా చూపిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ కు విరుద్ధంగా ఉన్న ట్వీట్ కు సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరుతో కొంతమంది కావాలని ఈ విధంగా గొడవలు సృష్టిస్తున్నారు అని మరికొందరు నెటిజన్లు గణేష్ కు వివరణ ఇస్తున్నారు. మరి ముందు ముందు బండ్ల గణేష్ ఈ విషయంలో ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











