ఎక్కువగా నమ్మడం, ప్రేమించడం వల్ల బాధ కూడా ఎక్కువే.. పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ ట్వీట్స్

టాలీవుడ్ నిర్మాత నటుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారేలా ట్వీట్స్ చేశాడు. గతంలో ఎప్పుడు లేని విదంగా మొదట కొంత విచారకారణమైన ట్వీట్స్ చేసిన బండ్లన్న అనంతరం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ను పొగిడే విధంగా స్పందించాడు. సాధారణంగా పవన్ ప్రస్తావన వస్తే బండ్ల గణేష్ పొగడ్తలతో ఉప్పొంగిపోతారు అని అందరికి తెలిసిందే. ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బండ్ల గణేష్ స్పీచ్ ఉండాలి అని అభిమానులు ఎంతో ఆశగా కోరుకుంటున్నారు. ఇక ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయ్యింది. బండ్ల గణేష్ కు సంబంధించిన పూర్తి కామెంట్స్ వివరాల్లోకి వెళితే

 విజిల్స్ వేసేలా..

విజిల్స్ వేసేలా..

బండ్ల గణేష్ ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక పవన్ కళ్యాణ్ పై కూడా నిత్యం ఏదో ఒక విషయంలో పొగుడుతూనే ఉంటాడు. గతంలో చాలాసార్లు పవర్ స్టార్ సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పొగడ్తల వర్షంతో అభిమనుల చేత విజిల్స్ వేయించాడు. ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బండ్ల గణేష్ పాల్గొంటారు అని అందరు అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మినిష్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం కారణంగా ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదని భావనతో ఈవెంట్ వాయిదా వేశారు.

బాధ కూడా కూడా ఎక్కువగానే..

బాధ కూడా కూడా ఎక్కువగానే..

ఇక బండ్ల గణేష్ ట్వీట్స్ విషయానికి వస్తే.. మొదట ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఎక్కువగా చనువు ఇవ్వడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది.. అని బండ్ల గణేష్ ట్వీట్ లో చెప్పాడు. అలాగే మరొక ట్వీట్ లో.. ఎవరైన మిమ్మల్ని తిరస్కరించిన బాధ పడకండి .. అలాంటి వారు ఖరీదైన వాటిని తిరిస్కరించి.. చవకైనా వాటిని ఎంచుకుంటారు.. వారికి మీ విలువ తెలియదు అని అన్నారు.

ఎక్సపయిరీ డేట్ లేదు..

ఎక్సపయిరీ డేట్ లేదు..

ఇక బండ్ల గణేష్ అలా విచారంగా ఎందుకు ట్వీట్ చేశాడు అని అనుకునేలోపే మరో ట్వీట్స్ లో పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చాడు. సూర్యుడి తేఙస్సుకు.. చంద్రుడి చల్లదనానికి.. పవన్ పై అభిమానానికి ఎక్సపయిరీ డేట్ లేదు. జై పవన్ కళ్యాణ్ దేవర అని పేర్కొన్నారు.

పవన్...అంటే వాయువు

పవన్...అంటే వాయువు

పవన్...అంటే వాయువు. అది లేని చోటు భూమిపై లేదు. పవన్ అభిమానులు లేని చొటు కూడా లేదు. పవన్ పై అభిమానం కూడా వాయువులా అనంతం.. అంటూ..ఈశ్వరా.. పవరేశ్వరా.. పవనేశ్వరా..అని వివరణ ఇచ్చారు. ప్రతీ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ దేవర అని కూడా మెన్షన్ చేశాడు. గతంలోనే పవన్ కళ్యాణ్ ను దేవర అని సంబోధించుకుంటాను అని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు.

Recommended Video

Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
ఈవెంట్ క్యాన్సిల్

ఈవెంట్ క్యాన్సిల్

అంజనీ పుత్ర 'పవన ' సుత నామ.. ఊరకే ఎవరికీ రాదు... అందరు పుడుతుంటారు చచ్చిపోతుంటారు కానీ కుండరా మాత్రమే చెరిత్రలాల్లో నిల్చిపోతారు మా దేవర పవన్ కళ్యాణ్ అని బండ్ల గణేష్ తెలియజేశారు. ఇక సోమవారం సాయంత్రం జరగబోయే భీమ్లా నాయక్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ వినాలని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో బ్యాడ్ న్యూస్ వచ్చేసింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్ రెడ్డి మరణించడంతో పవన్ కళ్యాణ్ ఈవెంట్ ను వాయిదా వేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X