గబ్బర్ సింగ్ దర్శకుడికి బండ్ల గణేష్ క్షమాపణ.. అలాంటివి అవసరం లేదంటూ డైరెక్టర్ ట్వీట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మనస్పర్థలు రావడం అనేది చాలా సహజం. ఒక సినిమా కొందరిని దగ్గర చేస్తే మరికందరిని మళ్ళీ కలవకుండా చేస్తుంది. సినిమా ప్రపంచంలో కోపాలు అలకలు చాలా కామన్. అయితే అన్ని మరచిపోయి మళ్ళీ ఒకటవ్వడం అనేది చాలా రేర్. నలుగురిలో క్షమాపణ చెప్పాలి అంటే కూడా గట్స్ ఉండాలి. ఇక బండ్ల గణేష్ ఆ విషయంలో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఆయన క్షమాపణపై దర్శకుడు కూడా ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు.

 వారిద్దరి మధ్య గొడవ

వారిద్దరి మధ్య గొడవ

ఇండస్ట్రీలో బండ్ల గణేష్ కి కొందరితో విబేధాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన డైరెక్ట్ గా కౌంటర్స్ కూడా ఇచ్చారు. ఇక హరీష్ శంకర్ గోడవతో మళ్ళీ జీవితంలో అతనితో సినిమా చేయనని చెప్పడం అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది. గబ్బర్ సింగ్ కి కలిసి పని చేసిన ప్రముఖులు విడిపోవడం ఓ వర్గం అభిమానులను హార్ట్ చేసింది.

అప్పుడు సంస్కారం లేదని బండ్ల గౌంటర్

అప్పుడు సంస్కారం లేదని బండ్ల గౌంటర్

ఈ ఏడాది మే నెలలో గబ్బర్ సింగ్ 8ఏళ్ళయిన సందర్భంగా దర్శకుడు హరీష్ ఆ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందరి పేర్లను గుర్తు చేసుకున్న హరీష్ ఒక్క బండ్ల గణేష్ పేరు వేయలేదు. దీంతో బండ్లకు కోపం వచ్చింది. హార్ట్ అయ్యాడు. అతను రీమేక్ దర్శకుడు. సినిమాలో అన్ని విషయాలు పవన్ కళ్యాణ్ చూసుకున్నారు. సంస్కారం లేదని అన్నాడు.

హరీష్ శంకర్ కౌంటర్

హరీష్ శంకర్ కౌంటర్


ఇక హరిష్ కూడా ఆ తరువాత సీరియస్ అయ్యాడు. అవును ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చారో అర్ధమవుతుంది. మొదటి రెండు సినిమాలు ఏదో హిట్టయినట్లు. నువ్వేమైనా దిల్ రాజునా? లేక అరవింద్‌నా? మైత్రీ మూవీ మేకర్స్ అనుకుంటున్నారా? అని హరీష్ ఇచ్చిన కౌంటస్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఆ గొడవతో హరీష్ తో సినిమా చేయనని అన్నాడు.

ఇప్పుడు క్షమాపణ చెప్పిన హరీష్ శంకర్

ఇప్పుడు క్షమాపణ చెప్పిన హరీష్ శంకర్

ఇక ఫైనల్ గా ఇప్పుడు ఎందుకో బండ్ల గణేష్ కు జ్ఞానోదయం అయినట్లు సోషక్ మీడియాలో క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ ఫైనేస్ట్ డైరెక్టర్. సార్.. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. నాకు మీతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేయాలని ఉందని బండ్లగణేష్ ట్వీట్ చేశాడు.

హరీష్ శంకర్ ఏమన్నాడంటే..

హరీష్ శంకర్ ఏమన్నాడంటే..


ఇక అందుకు హరీష్ శంకర్ కూడా ఎవరు ఊహించని సమాధానం ఇచ్చారు. అసలు స్పందిస్తారో లేదో అనుకుంటూ ఉండగా.. మనలో మనకు సారిలు ఎందుకు అన్నట్లు కవర్ చేసేశారు. సార్ దయచేసి అలా అనకండి. మీరు నా బ్రదర్ లాంటి వాళ్ళు. నా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సినిమా మనకంటే చాలా గొప్పది. అందుకే గొప్ప సినిమాలతో మరింత గొప్పగా జీవించాలని హరీష్ శంకర్ ఆన్సర్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X