MAA Elections ముందు రోజు ప్రకాష్ రాజ్ కి షాకిచ్చిన బండ్ల.. సపోర్ట్ చేస్తానని ఇప్పుడేమో ఇలా?
కొన్ని నెలలుగా చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. అక్టోబర్ 10వ తేదీ అంటే ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలు కానున్న ఈ ఓటింగ్ ప్రక్రియ రెండు గంటల వరకు కొనసాగనుంది. అయితే ముందు నుంచి ప్రకాష్ రాజు ఫైనల్ కి సపోర్ట్ చేస్తూ వస్తున్న బండ్ల గణేష్ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. బండ్ల గణేష్ ఏం చేశారు ఏమైంది అన్న వివరాల్లోకి వెళితే

మా రచ్చ రచ్చ
గత కొంతకాలం నుంచి మా ఎన్నికల వ్యవహారాల గురించి టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ 'సినిమా బిడ్డల ప్యానల్'తో పోటీకి దిగుతుండగా విష్ణు కూడా తన ప్యానల్ తో పోటీకి దిగుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నామని ముందు నుంచి చెబుతూ వచ్చిన జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉన్నారు.

ట్విస్టుల మీద ట్విస్టులు
అయితే నిజానికి ముందు నుంచి బండ్ల గణేష్ కు ఇస్తామని చెప్పిన జనరల్ సెక్రటరీ బరిలో జీవిత ఎంట్రీ ఇవ్వడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ బయటకు రావడం, స్వతంత్రంగా జీవిత మీద పోటీ చేస్తానని చెప్పడమీ కాక జీవిత రాజశేఖర్ ఇష్టం లేదని చెబుతూ చిరంజీవి కుటుంబ వ్యవహారాలు గుర్తు చేస్తూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

జీవిత దెబ్బతో
ఇక తాను జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి గతంలోనే ప్రకటించిన బండ్ల, మా సభ్యులు మిగతా వారిలో ఎవరు ఎవరికైనా ఓటు వేయండి.. ఎవరు గెలిచినా పర్లేదు.. కానీ జనరల్ సెక్రటరీగా మాత్రం నాకే ఓటు వేయండి అని బండ్ల గణేష్ అప్పట్లో ప్రచారం చేసుకున్నారు. ఒకే ఒక్క ఓటు, మా కోసం మన కోసం మనందరి కోసం.. మా తరుపున ప్రశ్నించడం కోసం అంటూ పోస్టర్ లో పేర్కొనడం సంచలనంగా మారగా ఆయన జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ కూడా వేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన జనరల్ సెక్రటరీ పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

నామినేషన్ ఉపసంహరించుని
''నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నా.'' అంటూ ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ తో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఆయన బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ ఇస్తున్నట్టు భావించారు. ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆయన అదే విషయాన్ని ప్రకటించారు.

హ్యాండ్ ఇచ్చి
అయితే ఇప్పుడు మళ్ళీ షాక్ ఇస్తూ ''మా సభ్యులకు విన్నపం దయచేసి మీ అమూల్యమైన ఓటు జనరల్ సెక్రెటరీగా రఘు బాబు వేసి గెలిపించ వలసినదిగా నా ప్రార్థన, మీ బండ్ల గణేష్'' అంటూ ఒక పోస్ట్ చేశారు. తాను సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ గురించి ఏమీ ప్రచారం చేయలేదు కానీ జీవితకు వ్యతిరేకంగా మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న రఘుబాబుకు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











