కరోనా నుంచి బండ్ల గణేష్ సేఫ్.. అంతా పరమేశ్వరుడి దయే అంటూ ట్వీట్
టాలీవుడ్‌లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ప్రయాణం మొదలుపెట్టి.. ఇండస్ట్రీకే బ్లాక్ బస్టర్‌లు ఇచ్చిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. అది వివాదాలపరంగానైనా, సినిమాలపరంగానైనా, రాజకీయాలపరంగానైనా సరే బండ్ల గణేష్ పేరు మార్మోగిపోవాల్సిందే. గత ఎన్నికల్లో బండ్ల గణేష్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మళ్లీ వెండితెరపై మునుపటిలా తన సత్తా చాటాలని ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా బండ్ల గణేష్‌కు కరోనా అనే వార్త ఎంతగా సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బండ్ల గణేష్ ఆరోగ్యం..
బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త క్షణాల్లో వైరల్ అయింది. ఈ మేరకు ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు సైతం ఆందోళన చెందారు. అయితే స్వయంగా బండ్ల గణేష్ ఆ వార్తలను ధృవీకరించి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. ఉంటే ఉంటామని పోతే పోతామని ఎంతో గుండె నిబ్బరం, విశ్వాసంతో తన బంధువులతో చెప్పుకొచ్చాడట.

తాజా అప్‌డేట్..
తాజాగా బండ్ల గణేష్ తన ఆరోగ్యం, కరోనా వార్తలపై ఓ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన మెడికల్ సర్టిఫికేట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కరోనా నెగెటివ్ అని వచ్చిందని తెలిపాడు. ఈ మేరకు దండం పెడుతూ దేవుడిని తలుచుకున్నాడు.

బండ్లన్నకు విషెస్..
బండ్ల గణేష్ ఆరోగ్యంపై అందరూ స్పందిస్తున్నారు. కరోనా నుంచి బయట పడటంతో అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదంతా ఈశ్వరుని కృపేనని అంటుంటే.. అవును ఇది ఆ పరమేశ్వరుని దయేనని నెటిజన్లకు బదులిస్తున్నాడు.
Recommended Video

అది నా ధర్మం..
అయితే తనకు కరోనా నెగిటివ్ రావడం పట్ల ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మీరు 14 రోజుల తరువాత దయ చేసి మీ ప్లాస్మాను దానం చేయండి, అది ఇంకొకరి ప్రాణాలను కాపాడుతుందని కోరాడు. కరోనాపై పోరాడుతున్న కొందరినైనా కాపాడండని ట్వీట్ చేయగా.. కచ్చితంగా ఇస్తాను అది నా ధర్మమని బండ్లన్న ఎంతో పెద్ద మనసుతో సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











