బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు. కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన ఇటీవల పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. బండ్ల గణేష్ కోవిడ్ 19 బారిన పడటం ఇది రెండోసారి. గతంలో జూన్ 2020న ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇటీవల ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్నప్పటికీ ఆయనకు రెండోసారి కరోనాపాజిటివ్ అని తేలడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కోవిడ్19 పాజిటివ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బండ్ల గణేష్‌ను అపోలో హాస్పిటల్‌లోని ఐసీయూలో చేర్పించినట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.

Bandla Ganesh tested coronavirus positive second time even after Vaccind first dose

ఇటీవల కాలంలో వ్యాక్సిన్స్ తీసుకొన్న తర్వాత కూడా పలువురు సినీ ప్రముఖులు కరోనావైరస్ బారిన పడ్డారు. వారిలో అల్లు అరవింద్ కూడా ఉండటం తెలిసిందే. అయితే రెండో బారిన పడిన బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో కుటుంబ సభ్యులు ఐసీయూలో చేర్పించినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X