For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bandla Ganesh హీరోగా సంచలన సినిమా రీమేక్.. దర్శకుడు ఎవరంటే?

  |

  ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్ తర్వాత కాలంలో నటుడిగా మారారు. కమెడియన్ గా మారి అనేక వందల సినిమాల్లో నటించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ నిర్మాత అని పేరు కూడా తెచ్చుకున్నారు. బాద్షా గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాలతో ఆయన మంచి క్రేజ్ సంపాదించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీర భక్తుడిగా చెప్పుకునే ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని చాలా రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఆ ప్రచారం నిజమైంది.. ఆ వివరాల్లోకి వెళితే

  సైలెన్స్

  సైలెన్స్

  నటుడిగా అనేక సినిమాల్లో నటించి తరువాత కాలంలో ప్రొడ్యూసర్ గా మారి సూపర్ హిట్ సినిమాలు అందించిన బండ్ల గణేష్ ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆయన మళ్లీ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చిన అప్పుడు అది తనకు మంచి కం బ్యాక్ అవుతుందని భావించినా అది కాలేదు. ఇక ఆయన చిన్న పాత్రలు చేయకూడదని కూడా ఆయన ఫిక్సైనట్లు ప్రచారం జరిగినా ఆయన క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కనిపించారు.

  ప్రచారం జరిగినట్టుగానే

  ప్రచారం జరిగినట్టుగానే

  ఇక ఆయన ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు అంటూ కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది.. తమిళంలో యోగి బాబు హీరోగా వచ్చిన మండేలా సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని ఆ రీమేక్ లో నటించమని బండ్ల గణేష్ కు ఆఫర్ వచ్చిందని కూడా ప్రచారం జరిగింది. ఆ తరువాత వెంకట్ అనే ఒక కొత్త దర్శకుడు బండ్ల గణేష్ కోసం ఒక కథ రాసుకుని ఈ మధ్య బండ్ల గణేష్ ని కలిసి కథ వినిపించగా డానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరగగా అదే నిజం అయింది.

   కొత్త దర్శకుడితో

  కొత్త దర్శకుడితో

  వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు. సెప్టెంబర్ తొలివారంలో సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇక ఈ ప్రకటన నేపధ్యంలో దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ "బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని సంప్రదించాంమని ఆయన ఓకే చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉందని వారు వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారని కూడ వెల్లడించారు.

  రికార్డులు-రివార్డులు

  రికార్డులు-రివార్డులు

  ఇక తమిళంలో ఆర్. పార్తిబన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి‌ రీమేక్ ఈ సినిమా. పార్తిబన్ కి ఈ సినిమాకు గాను జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. అంతే కాక సినిమాకు పలు పురస్కారాలు దక్కాయి.‌ అయితే ఒత్తు సెరుప్పు సైజ్ 7 అంటే సింగిల్ స్లిప్పర్ సైజ్ 7, ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది.

  Corona Effect, తండ్రికి క్షవరం చేసిన Bandla Ganesh || Filmibeat Telugu
  సంచలన సినిమాలో

  సంచలన సినిమాలో

  ఈ సినిమాని బయోస్కోప్ ఫిల్మ్ ఫ్రేమర్స్ బ్యానర్‌లో ఆర్. పార్థిబన్ నిర్మించారు, దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పార్థిబన్ ఏకైక పాత్రలో నటించారు. ఈ సినిమాకి నేపథ్య స్కోర్ సి.సత్య స్వరపరిచారు మరియు ఈ చిత్రంలో సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఒక పాట మాత్రమే ఉంది. ఈ సినిమా ఒకే వ్యక్తి రచన, దర్శకత్వం, సోలో నటన మరియు నిర్మించినందుకు గాను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్క్డింది.

  ఇక ఈ సినిమా సోలో యాక్ట్‌తో ప్రపంచంలోని పదమూడవ చిత్రంగా నిలిచింది. ఇక తెలుగు సినిమాకి అరుణ్ దేవినేని సినిమాతోగ్రఫీ అందిస్తూ ఉండగా గాంధీ ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

  English summary
  Bandla Ganesh as a hero, Film to go on the floors soon under Venkat Chandra's direction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X