twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీకు దండం పెడతా, పరువు తీయొద్దు.... బండ్ల గణేష్ రిక్వెస్ట్

    |

    ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండే సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యర్థి పార్టీలపై తన పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడిన గణేష్... ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    ఎన్నికల సమయంలో పార్టీ ఓడిపోతే బ్లేడుతో తన గొంతుకోసుకుంటానంటూ గణేష్ చేసిన హడావుడి అప్పట్లో తెలుగు మీడియాలో సంచనం అయింది. అంతే కాదు ఓ వైపు సీరియస్‌గా పొలిటిక్స్ జరుగుతుంటే తన ఫన్నీ వ్యాఖ్యలు, చేష్టలతో తెలుగు రాష్ట్రాల ప్రజలను తెగ నవ్వించాడు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న గణేష్ తాజాగా ఓ పొలిటికల్ ఇష్యపై రియాక్ట్ అయ్యారు.

    పల్నాడు పరువు తీయొద్దు అంటూ...

    పల్నాడు పరువు తీయొద్దు అంటూ...

    ఇటీవల పల్నాడు ప్రాంతంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశం అయింది. ఈ అంశంపై గణేష్ స్పందించారు. మీకు దండం పెడతాను, పల్నాడు పరువు తీయొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ తన సోషల్ మీడియా పేజీలో ఓ పోస్ట్ పెట్టారు.

    ఆంధ్ర మరో బీహార్ అయింది అంటూ...

    ఆంధ్ర మరో బీహార్ అయింది అంటూ...

    ఇప్పటికే గొడవలతో చాలా సార్లు పల్నాడు పరువు పోయింది. ఇలాంటి పనులకు దయచేసి పాల్పడవద్దు. ఆంధ్ర మరో బీహార్ మాదిరిగా తయారయ్యింది అంటూ తనదైన వ్యాఖ్యలు చేశారు గణేష్. ఇరు పార్టీల వారు కలిసి పని చేస్తూ ప్రజలకు మంచి జరిగేలా చూడాలని కోరారు.

    దగా పడ్డ తెలుగు ప్రజలారా ఏ నాయకుడినీ నమ్మొద్దు

    దగా పడ్డ తెలుగు ప్రజలారా ఏ నాయకుడినీ నమ్మొద్దు

    అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య గొడవ జరుగుతుండంతో.... బండ్ల గణేష్ కాస్త పదునైన వ్యాఖ్యలే చేశారు. దగా పడ్డ తెలుగు ప్రజలారా ఏ నాయకుడినీ నమ్మొద్దు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా రెండు వర్గాలను విమర్శించే ప్రయత్నం చేశారు.

    మీకు సహాయం చేసే స్థితిలో లేను

    మీకు సహాయం చేసే స్థితిలో లేను

    మీకు సహాయం చేసే స్థితిలో నేను లేను, మననల్ని ఆ దేవుడే కాపాడాలి, ఆయనే అందరి సమస్యలు తీరుస్తాడు అంటూ బండ్ల గనేష్ వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. దీన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    English summary
    Film producer and actor Bandla Ganesh has reacted to the ongoing political disputes in Palnadu region. Concerned that these conflicts will make Pallandu worse. He made these comments in the wake of a dispute between the ruling party and the main opposition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X