For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జనసేన మీద బండ్ల ట్వీట్.. వెంటనే డిలీట్... చిన్నతప్పుతో దొరికిపోవడంతో ఆడుకున్న నెటిజన్లు!

  |

  సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న బండ్ల గణేష్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆయన జనసేన పార్టీకి సంబంధించిన చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. దాన్ని కొద్దిసేపటికే డిలీట్ చేసిన బండ్ల గణేష్ అలాంటిదే మరో ట్వీట్ చేశారు. అయితే అసలు బండ్ల గణేష్ ఏం ట్వీట్ చేశారు ? అది ఎందుకు వివాదంగా మారింది. అనే వివరాల్లోకి వెళితే

  ప్రొడ్యూసర్ గా మారి

  ప్రొడ్యూసర్ గా మారి

  సినిమాల్లోకి ప్రొడక్షన్ మేనేజర్ గా ఎంట్రీ తర్వాత కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ కాలం కలిసి రావడంతో ప్రొడ్యూసర్ అవతారమెత్తారు. బయట కూడా పౌల్ట్రీ బిజినెస్ నడుపుకునే బండ్ల గణేష్ ఆ బిజినెస్ మీద వచ్చే డబ్బు తీసుకొని వచ్చి సినిమాలలో పెట్టుబడులు పెట్టి స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, ఎన్టీఆర్ తో బాద్షా, టెంపర్ లాంటి సినిమాలు చేసిన ఆయన తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

  సంచలన కామెంట్లు

  సంచలన కామెంట్లు

  అయితే 2018 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేశారు. నిజానికి ఆయన అప్పట్లో ని షాద్ నగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు అని ప్రచారం జరిగినా, చివరికి టికెట్ దక్కక పోయినా ప్రచారంలో మాత్రం విస్తృతంగా పాల్గొన్నారు.

  అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటాను అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో బండ్ల గణేష్ ఏదో మాటవరసకి ఆ మాట అన్నాను అని చెబుతూ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు.

  ఇంకా కాంగ్రెస్ లోనే అయితే కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని రాజకీయాల మీద కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా ప్రకటించారు. అయితే పార్టీ మారే రకం కాదని పేర్కొన్న బండ్ల గణేష్ జనసేన పార్టీ అంటే తనకు అభిమానమే కానీ ఆ పార్టీలో చేరేది లేదని చెప్పుకొచ్చారు.

  ఆసక్తికర ట్వీట్

  ఆసక్తికర ట్వీట్

  అయితే కొద్ది రోజుల క్రితం మరో ఇంటర్వ్యూలో జనసేన పార్టీ తెలంగాణ బాధ్యతలు మీకు అప్పగిస్తే చేస్తారా అని ప్రశ్నించగా అసలు ఆ సమస్య లేదని తనకు అప్పగించే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. అయితే మరి ఈరోజు ఏమైందో ఏమో తెలియదు కానీ ''తెలంగాణ రాష్ట్రంలో జనసేన ఒక గొప్ప శక్తిగా అవతరించిన పోతుంది'' అంటూ ట్వీట్ చేశారు, దీంతో ఈ ట్వీట్ మీద మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.

  Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
  జనసేన పోతోందా

  జనసేన పోతోందా

  వెంటనే తప్పు సరిదిద్దుకున్న ఆయన ''తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది'' అని పోస్ట్ చేశారు. ఈలోపే అవును అవతరించింది పోయింది ఆ విషయం మీకు ఇప్పుడు తెలిసిందా అని కొందరు కామెంట్లు చేయగా అసలు ఏపీలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటని మరికొందరు కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు అన్నీ చూశాక బండ్ల గణేష్ ట్వీట్ డిలీట్ చేసి సరైన అర్థం వచ్చేలా పెట్టారు.

  English summary
  Bandla Ganesh tweets about telangana janasena and gets trolled by netizens.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X