Bandla Ganesh : వాళ్ళు చెప్పారంటూ మా ఎలక్షన్స్ నుంచి ఔట్.. సంచలనం రేపుతున్న ట్వీట్!

టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో తాజాగా మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా జనరల్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగిన సినీనటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గారు. వాళ్ళు చెప్పడం వల్లే నేను ఉపసంహరించుకున్నారు అంటూ తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. అసలు ఆయన బరిలోనుంచి తప్పుకో మని కోరింది ఎవరు బండ్ల గణేష్ ఎందుకు బరిలో నుంచి తప్పుకున్నారు అనే వివరాల్లోకి వెళితే

ముందు నుంచి ప్రకాష్ రాజ్ వెంటే

ముందు నుంచి ప్రకాష్ రాజ్ వెంటే

గత కొంతకాలం నుంచి మా ఎన్నికల వ్యవహారాల గురించి టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను 'సినిమా బిడ్డల ప్యానల్' ప్రకటించారు. అయితే అందులో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నామని ముందు నుంచి చెబుతూ వచ్చిన జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉండటం తో అందరికీ షాక్ అనే చెప్పాలి. ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించిన తరువాత మంచు విష్ణు కూడా ప్యానల్ ప్రకటించారు. ముందు నుంచి బండ్ల గణేష్ కు ఇస్తామని చెప్పిన జనరల్ సెక్రటరీ బరిలో జీవిత ఎంట్రీతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ బయటకు వచ్చి
జీవిత మీద చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.

జీవిత వ్యవహారంతో

జీవిత వ్యవహారంతో

ఇక తాను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న సంగతి గతంలోనే ప్రకటించిన బండ్ల, మా సభ్యులు మిగతా వారిలో ఎవరు ఎవరికైనా ఓటు వేయండి.. ఎవరు గెలిచినా పర్లేదు.. కానీ జనరల్ సెక్రటరీగా మాత్రం నాకే ఓటు వేయండి అని బండ్ల గణేష్ ఒక పోస్టర్ ద్వారా ప్రక్లాటించారు. ఒకే ఒక్క ఓటు, మా కోసం మన కోసం మనందరి కోసం.. మా తరుపున ప్రశ్నించడం కోసం అంటూ పోస్టర్‌ లో పేర్కొనడం సంచలనంగా మారింది.

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

ఇక తాజాగా బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ కూడా వేసిన సంగతి తెలిసిందే. ఆ రోజే తనకు ఓటు వేస్తే వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఎవరు ఎవరికి ఓటు వేసినా పర్వాలేదు తనను మాత్రం జనరల్ సెక్రెటరీగా గెలిపించాలని కోరుతూ వచ్చిన బండ్ల గణేష్ తాజాగా జనరల్ సెక్రటరీ పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

నామినేషన్ ఉపసంహరించుకున్నా

నామినేషన్ ఉపసంహరించుకున్నా

''నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను.'' అంటూ ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ తో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఆయన బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ ఇస్తున్నట్టే చెప్పచ్చు. బండ్ల గణేష్ నటుడిగా కంటే కూడా నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు.

డేగల బాబ్జీ

డేగల బాబ్జీ

ఇక ఇన్నాళ్ళ పాటు నటుడిగా, నిర్మాతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'డేగల బాబ్జీ' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు బండ్ల గణేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X