Bandla Ganesh కొత్త అవతారం.. 'డేగల బాబ్జీ'గా ఇంట్రెస్టింగ్ లుక్‌తో!
మెడియన్ గా మారి అనేక సినిమాల్లో నటించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ స్టార్ నిర్మాత అని పేరు కూడా తెచ్చుకున్నారు. బాద్షా, గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాలతో ఆయన మంచి క్రేజ్ సంపాదించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీర భక్తుడిగా చెప్పుకునే ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఆసక్తిరేపుతున్న లుక్స్
నటుడిగా అనేక సినిమాల్లో నటించి తరువాత కాలంలో ప్రొడ్యూసర్ గా మారి సూపర్ హిట్ సినిమాలు అందించిన బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగు ఈ మధ్యనే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. రిషి ఆగస్త్య సమర్పకుడిగా, స్వాతి చంద్ర నిర్మాతగా యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం అనంతరం పోలీస్ స్టేషన్ సెట్‌లో బండ్ల గణేష్‌పై సన్నివేశాలను మొన్నీమధ్య చిత్రీకరించారు.

అవార్డుల పంట
తమిళంలో ఆర్. పార్తిబన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి రీమేక్ ఈ సినిమా. పార్తిబన్ కి ఈ సినిమాకు గాను జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. అంతే కాక సినిమాకు పలు పురస్కారాలు దక్కాయి.

సింగిల్ పాత్రతో
అయితే ఒత్తు సెరుప్పు సైజ్ 7 అంటే సింగిల్ స్లిప్పర్ సైజ్ 7, ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. ఈ సినిమాని బయోస్కోప్ ఫిల్మ్ ఫ్రేమర్స్ బ్యానర్‌లో ఆర్. పార్థిబన్ నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పార్థిబన్ ఏకైక పాత్రలో నటించగా అదే పాత్రను ఇక్కడ బండ్ల గణేష్ పోషిస్తున్నారు.

అంచనాలు పెంచేలా
బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు 'డేగల బాబ్జీ' టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కేవలం కనులు మాత్రమే కనిపించేలా ముఖానికి కండువాతో కవర్ చేసిన బండ్ల గణేష్ కనిపిస్తుంటే. ఆయన కన్నుపై కత్తిగాటు, దానికి వేసిన కుట్లు, గాయం నుండి కారుతున్న రక్తం అన్నీ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి. ఈ టైటిల్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు.
Recommended Video

డేగల బాబ్జీ
ఇక పోస్టర్ రిలీజ్ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ "తమిళ హిట్ 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి రీమేక్ ఇదని తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారని అన్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుందని అన్నారు.
అలాగే ఈరోజు రిలీజ్ చేసిన 'డేగల బాబ్జీ' టైటిల్‌కూ మంచి స్పందన లభిస్తోందని అన్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతోండగా త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. ఇక బండ్ల గణేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నారు.


Click it and Unblock the Notifications











