హీరో సూర్య కోసం రాజమౌళి ‘బందోబస్త్’... పెరిగిన అంచనాలు!
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బందోబస్త్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విలక్షణ నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తమిళ్‌లో కాప్పాన్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో బందోబస్త్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి.
ఈ మేరకు బందోబస్త్ తెలుగు, ఇంగ్లీష్ టైటిల్ పోస్టర్లను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన రాజమౌళి.. బందోబస్త్ చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య, మోహన్ లాల్ లతో పాటు ఆర్య కూడా నటిస్తున్నారు. ఈ ముగ్గురి పాత్రలు హైలైట్ గా ఉండేలా డైరెక్టర్ కేవీ ఆనంద్ ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారని అంటోంది చిత్రయూనిట్.

గతంలో కేవీ ఆనంద్, సూర్య కాంబోలో వచ్చిన వీడోక్కడే, బ్రదర్స్ సినిమాలు సక్సెస్ సాధించడంతో బందోబస్త్ పై అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తోంది. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసి అతిత్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. సూర్యకు తెలుగులో ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని అంటున్నారు యూనిట్ సభ్యులు.
ఇక మరోవైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా RRR వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











