»   » పరువు హత్య కథాతో బంగారి బాలరాజు.. ప్రణయ్ మరణం ఆగేదేమో..

పరువు హత్య కథాతో బంగారి బాలరాజు.. ప్రణయ్ మరణం ఆగేదేమో..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె.యమ్ డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం హైదరాబాద్ మూవీ ఆఫీస్ లో జరిగింది.

  దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... మా చిత్రం బంగారి బాలరాజు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే చిన్నికృష్ణ - చిట్టిబాబు రెడ్డిపోగు సంగీతం అందించిన ఆరు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలానే ఈ చిత్రాన్ని మా శ్రేయోభిలాషికి చూపించగా, అతను థియేటర్ నుండి బయటకు రాగానే ఈ చిత్రం ఒక నెల ముందు వచ్చి ఉంటే మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య జరిగి ఉండేది కాదేమోనని అన్నారు. ఈనెల 25 న విడుదల అవుతున్న మా చిత్రాన్ని అందరూ చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము అని దర్శకుడు తెలిపారు.

  Bangari Balaraju movie set to release on October 25th

  బంగారి బాలరాజు చిత్ర నిర్మాతల్లో ఒకరైన కె.యమ్ డి. రఫి మాట్లాడుతూ.. కోటేంద్ర దుద్యాల మాకు చెప్పిన చెప్పిన దానికంటే కూడా కధను బాగా తెరకెక్కించారు. ఈ స్టోరీ రాయలసీమ లో జరిగిన ఒక యధార్ధ పరువు హత్యను సినిమా టిక్ గా మా దర్శకుడు చూపించిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల చేస్తున్నాము. "బంగారి బాలరాజు" అందరికి నచ్చుతుంది అని నిర్మాత రఫి తెలిపారు.

  మరో నిర్మాత రెడ్డం రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ... ఈ చిత్రం ద్వారా మా అబ్బాయి రాఘవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మొదటి కాపీ చూసాము. చిత్రంలో ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లి కొడుకుల సెంటిమెంట్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. మొదటి సినిమా అయినా మా అబ్బాయి బాలరాజు క్యారెక్టర్ లో బాగా నటించి, అనుకున్న దానికంటే బాగా చేసాడు. ఈ నెల 25న "బంగారి బాలరాజు" తో వస్తున్న మా అబ్బాయికి మీ మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

  English summary
  Director Kotendra Dudyala’s ‘Bangari Balaraju’ Bangari Balaraju movie set to release on October 25th. Raghav, Karonya Katrin, Rohini, Ajay Ghosh, Apparao and Lekhana are playing lead roles. The movie is bankrolled by KMD Rafi, Reddam Raghavendra Reddy under the banner of Nandi creations.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more