ఫస్ట్ లుక్‌తో ట్విస్ట్ ఇచ్చిన బంగార్రాజు యూనిట్: సినిమాలో అసలు హీరో అతడు కాదా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా సీక్వెల్స్, ప్రీక్వెల్స్ చాలానే వస్తున్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో దర్శకులు, హీరోలు ముందడుగు వేస్తున్నారు. ఫలితంగా అదే తరహాలో మరిన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలా ఇప్పుడు రాబోతున్న మరో చిత్రమే 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'కు ఇది ప్రీక్వెల్‌గా వస్తోంది. ఇందులో అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఇది అక్కినేని మల్టీస్టారర్‌గా రూపొందుతోంది.

దాదాపు మూడు నాలుగేళ్ల క్రితమే 'బంగార్రాజు' ప్రాజెక్టు బాధ్యతను కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు నాగార్జున. ఈ క్రమంలోనే ఇది అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా వస్తుందన్న టాక్ కూడా వినిపించింది. కానీ, స్క్రిప్ట్ సరిగా లేకపోవడం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీన్ని అధికారికంగా మొదలు పెట్టేశారు. రెగ్యూలర్ షూటింగ్ మొదలైన తర్వాత దీన్ని ఎంతో వేగంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసుకున్నారు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నాగార్జున ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేస్తున్నారు.

 Bangarraju Movie First Look Poster Released

సోషియో ఫాంటసీ నేపథ్యంతో క్రేజీ సబ్జెక్టుతో అక్కినేని మల్టీస్టారర్‌గా రాబోతున్న 'బంగార్రాజు' మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం అప్పుడే ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా నుంచి బంగార్రాజు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఊహించని విధంగా అక్కినేని నాగ చైతన్యను చూపించారు. తద్వారా ఇందులో బంగార్రాజు నాగార్జున కాదు.. నాగ చైతన్య అని వెల్లడించి ప్రేక్షకులకు షాకిచ్చారు.

ఇక, నవంబర్ 23న అంటే రేపు అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అతడికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసింది చిత్ర యూనిట్. ఇందులో అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో కనిపిస్తున్నాడు. కర్రను గాలిలో విసురుతూ అదరగొట్టేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ మూవీ టీజర్‌ను నవంబర్ 23, ఉదయం 10:23 గంటలకు వదలబోతున్నారు. దీంతో అక్కినేని అభిమానులు వరుస ట్రీట్లతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే జనవరిలో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా అనూప్ రూబెన్స్ పూర్తి చేశాడు. అలాగే, అదిరిపోయే ట్యూన్స్‌ను కూడా రెడీ చేసేశాడు. అలాగే, ఇప్పటికే ఓ పాట కూడా విడుదలైంది. ఇక, ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో దేవలోకంలో రంభ ఊర్వశి మేనకల పాత్రలు కూడా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X