రిలీజ్‌కు ముందే రికార్డు కొట్టిన అక్కినేని హీరోలు: సంక్రాంతి హవా మొత్తం బంగార్రాజుదే

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీల్లో అక్కినేని కుటుంబం ఒకటి. అక్కినేని నాగేశ్వర్రావుతో ప్రారంభం అయిన వాళ్ల సినీ ప్రస్థానం మూడు తరాలుగా కొనసాగుతూనే ఉంది. అందులో నాగార్జున చాలా కాలంగా స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తూ సత్తా చాటుతుండగా.. ఆయన పిల్లలు నాగ చైతన్య, అఖిల్ కూడా హీరోలుగా సందడి చేస్తున్నారు. ఈ కుటుంబం నుంచి గతంలో 'మనం' అనే మల్టీస్టారర్ మూవీ వచ్చింది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి అక్కినేని ఫ్యామిలీ హీరోల కలయికలో సినిమా రాబోతుంది. అదే ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'బంగార్రాజు' మూవీ.

నాలుగేళ్ల క్రితం వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు బంగార్రాజు సీక్వెల్‌గా రూపొందుతోంది. భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాను తెరకెక్కించాడు. వాస్తవానికి ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టు పనులు చాలా కాలం క్రితమే మొదలయ్యాయి. కానీ, అనివార్య కారణాలతో ఇది పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఆగస్టులో 'బంగార్రాజు' షూటింగ్ మొదలైంది. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుని ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

నాగార్జున, నాగ చైతన్య కాంబోలో భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'బంగార్రాజు' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక, దీనికి సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌, టీజర్‌, పాటలను కూడా విడుదల చేశారు. అలాగే, ఇటీవలే మ్యూజికల్ నైట్ పేరిట ఓ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఇక, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించబోతున్నారు. దీంతో కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు మూవీ యూనిట్ సందడి బాగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు.

Bangarraju Movie Worldwide Theaters Count

ఈ సంక్రాంతి సీజన్‌కు విడుదల అవుతోన్న పెద్ద సినిమా 'బంగార్రాజు' కావడంతో.. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. బంగార్రాజు మూవీ నైజాంలో 211, సీడెడ్‌లో 130, ఆంధ్రాలో 335 వరకూ అంటే మొత్తంగా 675 నుంచి 700 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 100, ఓవర్సీస్‌లో 400 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇది నాగార్జున కెరీర్‌లోనే రికార్డు అని అంటున్నారు.

'బంగార్రాజు' మూవీని అక్కినేని స్టూడియోస్ బ్యానర్ సమర్పణలో జీ సంస్థ నిర్మించింది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే. వీళ్లతో పాటు ఈ సినిమా మరో ఆరుగురు హీరోయిన్లు కూడా నటించారని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X