For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రిలీజ్‌కు ముందు బంగార్రాజుకు మరో షాక్: ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. కలెక్షన్లపై ప్రభావం

  |

  ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త నేపథ్యాలు, ప్రయోగాలతో సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ మారుతోన్న ప్రేక్షకుల అభిరుచి ప్రకారం ఫిల్మ్ మేకర్లు ఇలా ముందుకు వస్తున్నారు. ఇలా వస్తున్న చిత్రాల్లో మల్టీస్టారర్ మూవీలు.. సినిమాలకు సీక్వెల్స్ కూడా ఉంటున్నాయి. ఇలా ఇప్పుడు రాబోతున్న చిత్రాల్లో 'బంగార్రాజు' ఒకటి. నాలుగేళ్ల క్రితం సూపర్ డూపర్ హిట్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు.

  టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

  అక్కినేని నాగార్జున చాలా ఏళ్ల క్రితమే 'బంగార్రాజు' ప్రాజెక్టు బాధ్యతను దర్శకుడు కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు. అంతేకాదు, దీన్ని అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా రూపొందించాలని కూడా సూచించాడు. కానీ, స్క్రిప్ట్ సరిగా లేకపోవడం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో తెలియదు కానీ ఈ సినిమా స్టార్ట్ కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కదని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీన్ని అధికారికంగా మొదలు పెట్టేశారు. అప్పుడే దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నాగార్జున ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించి.. వేగంగానే పూర్తి చేసేశారు.

  అక్కినేని హీరోల మల్టీస్టారర్‌గా, సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న 'బంగార్రాజు' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక, దీనికి సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్‌, పాటలను కూడా విడుదల చేశారు. అలాగే, తాజాగా మ్యూజికల్ నైట్ పేరిట ఓ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. అంతేకాదు, వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. వీటితో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాశాలు చేస్తున్నారు.

  Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీ

  Bangarraju Release Very Less Theaters in Nizam

  ఒకవైపు 'బంగార్రాజు' మూవీ విడుదలకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా నైజాం ఏరియాలో చాలా తక్కువ థియేటర్లలోనే విడుదల అవుతుందట. అదే రోజు దిల్ రాజు సోదరుడి కుమారుడు హీరోగా నటించిన 'రౌడీ బాయ్స్' మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించారని తెలుస్తోంది. అందుకే 'బంగార్రాజు' సినిమాకు థియేటర్ల కొరత ఏర్పడినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఇదే జరిగితే నైజాంలో కలెక్షన్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీలో టికెట్ రేట్ల వల్ల చిక్కులు వచ్చిన విషయం తెలిసిందే.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'బంగార్రాజు' మూవీని అక్కినేని స్టూడియోస్ బ్యానర్ సమర్పణలో జీ సంస్థ నిర్మించింది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే. వీళ్లతో పాటు ఈ సినిమా మరో ఆరుగురు హీరోయిన్లు కూడా నటించారని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

  English summary
  Akkineni Nagarjuna and Naga Chaitanya Did Bangarraju Movie Under Kalyan Krishna Direction. This Movie to Release Very Less Theaters in Nizam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X