Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్ బాస్ 3 వివాదం: శ్వేతారెడ్డి కేసుపై పోలీసులు ఏమంటున్నారంటే...
ప్రముఖ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో విషయంలో వివాదానికి తెర లేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె పోలీసులుకు కూడా ఫిర్యాదు చేశారు. కంటెస్టెంట్ల ఎంపిక దారుణంగా ఉందని, కోఆర్డినేటర్లు... తమ బాస్‌ను ఎలా ఇంప్రెస్ చేస్తారు, ఎలా సంతృప్తి పరుస్తారు అని అడగటం దేనికి సంకేతం అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసుపై బంజారాహిల్స్ పోలీసులు మీడియాతో మాట్లాడారు. బిగ్ బాస్ 3 షో మీద శ్వేతా రెడ్డి అనే జర్నలిస్టు కంప్లయింట్ చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ఏప్రిల్‌లో బిగ్ బాస్ 3కి సెలక్ట్ అయ్యారు అని చెప్పి రవికాంత్ అనే మా టీవీ కోఆర్డినేటర్ ఆమెను అప్రోచ్ అయ్యారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో కలిసి షో టర్మ్స్ అండ్ కండీషన్స్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత రఘు, అభిషేక్, శ్యాం ఈ ముగ్గురు కూడా కోఆర్డినేటర్స్ అని చెప్పి మరో మూడు మీటింగ్స్ ఆమెతో జరిపారు... అని పోలీసులు తెలిపారు.
అందంతో శ్రీముఖి అదరగొట్టిందిగా.. బిగ్‌బాస్‌కు ముందు మరింత హాట్‌గా!
4వ మీటింగ్ శ్రీనగర్ కాలనీలో జరిగినపుడు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్న తర్వాత కొన్ని అబ్యూసింగ్ వర్డ్స్ మాట్లాడారు. మా బిగ్ బాస్‌ను మీరు ఎలా సాటిస్పై చేస్తారు అనే పదాలతో పాటు మరికొన్న అబ్యూసింగ్ వర్డ్స్ వాడారు. దీనిపై ఆమె కంప్లయింట్ చేశారు. ఈ కేసును విచారిస్తున్నాం. ఆమె ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు. మీటింగులకు సంబంధించి సిసిటీవీ పుటేజీ సేకరిస్తున్నాం. ఆమె ఫోన్లో వాట్సాప్ సందేశాలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
ఆమె ఈ షోపై కాకుండా.... ఈ నలుగురిపై కంప్లయింట్ ఇచ్చింది. దానిపై విచారిస్తున్నాం. ఏమైనా అధారాలు లభిస్తే అందుకు తగిన విధంగా యాక్షన్ తీసుకుంటాం. అభ్యంతరకంగా మాట్లాడటం ద్వారా ఆమెను హర్ట్ చేశారనే పాయింటు మీదే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బిగ్ బాస్ సెలక్షన్ ప్రోసీజర్ ఎలా ఉందనేది కూడా తెలుసుకుంటాం. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.