HanuMan : హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదే స్పెషల్.. అసలు ఎవరూ ఊహించలేదు కదా!
సంక్రాంతి రేసులో ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రశాంత్ వర్మ తేజ సజ్జ 'హనుమాన్' ఒకటి. జాంబిరెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుడి కథ స్పూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు తాజాగా జరుపుకుంది. ఇక ఈ ఈవెంట్లో ఓ ప్రత్యేకత నెలకొంది. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అయ్యారు. ఇలా ఇంతకు ముంందు ఏ ఈవెంట్లో ఇలా పెట్టలేదు. అసలు అదేంటో స్టోరీలో తెలుసుకుందాం.
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'హనుమాన్'. ఇందులో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా.. అమృత అయ్యార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ప్రశాంత్ వర్మ, తేజ కాంబోలో ఇప్పటికే జాంబిరెడ్డి వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు 'హనుమాన్' సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. జనవరి 12న థియేటర్లలో ఆడియెన్స్ ను పాన్ వరల్డ్ లెవెల్ లో అలరించబోతోంది.

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో పాటు పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విజువల్స్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును అట్టహాసంగా నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యారు.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ ప్రత్యేకత నెలకొంది. ఈ ఈవెంటుకు సినిమా హీరో తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిక్ రైటర్స్, సింగర్స్, హీరోయిన్ అమృత అయ్యర్, జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్, నిర్మాత నిరంజన్ రెడ్డి, వరలక్ష్మి పలువురు వచ్చారు. అయితే వీరందరూ హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంటు స్టేజీ మీదకు చెప్పులు లేకుండా వచ్చారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇక హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆహాలో ప్రసారం అయిన సామ్ జామ్ కు వెళ్లిన చిరంజీవి.. అక్కడ చేసిన కామెంట్స్ వీడియోను ఈ ఈవెంట్లో ప్లే చేశారు. ఆ ఈవెంట్లో సామ్.. మీకు ఏ సూపర్ హీరో అంటే ఇష్టం.. సూపర్ మ్యానా, స్పైడర్ మ్యానా అంటూ పలువురి పేర్లు చెప్పి అడిగింది. అయితే ఈ క్రమంలో చిరంజీవి మాత్రం తనకు హను మాన్ అంటే ఇష్టమని చెప్పడం హైలెట్ గా నిలిచింది.
ఇక అలా చిరంజీవి చెప్పిన పేరును ఇప్పుడు హనుమాన్ గా పెట్టారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే 'హనుమాన్' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని... U/A సర్టిఫికేట్ ను అందుకుంది. జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ తో సహా 11 భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాలో హనుమాన్ గా చిరంజీవి ఏఐ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి.


Click it and Unblock the Notifications











