పల్లవి ప్రశాంత్‌తో కాదు.. అతడిని పెళ్లాడబోతున్న బర్రెలక్క.. ఎంగేజ్‌మెంట్ వీడియో వైరల్!

తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన బర్రెలక్క అలియాస్ శిరీష కూడా గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొన్నటి వరకు ఈమె బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అదంతా అబద్ధం అని ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన శిరీష ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది. అయితే ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా బయటకు రాలేదు. కానీ ఈయనకు సంబంధించిన అనేక విషయాలు వార్తలుగా నిలిచాయి. అందులో ఒకటే బర్రెలక్కతో పెళ్లి. ఈ వార్త తెగ సంచలనం చేసింది. అనేక మంది వీరిద్దరూ ప్రేమికులు అని పెళ్లి కూడా త్వరలోనే చేసుకోబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. కానీ దీనిపై స్పందించిన వీరిద్దరూ అవన్నీ తప్పు అని చెప్పుకొచ్చారు. తాము ఒకరినొకరు ఇప్పటికి ఒక్కసారి కూడా కలుసుకోలేదని చెప్పుకొచ్చారు.

Barrelakka Alias Shirisha Enguagement Video Goes Viral Check Details

ఇలా వీరిద్దరూ క్లారిటీ ఇచ్చినప్పటికీ చాలా మంది వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే అనుకున్నారు. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పడంతో అంతా వీరిద్దరి మధ్య బంధం ఉందని.. అందుకే ఆమెలాగే ఇతను కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పలువురు కామెంట్లు చేశారు. కానీ బర్రెలక్క మరోసారి ఈ విషయం స్పందించింది. నేరుగా చెప్పకపోయినా.. రైతుబిడ్డను పెళ్లి చేసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చింది.

తాజాగా బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేధికగా తన ఎంగేజ్ మెంట్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. అలాగే నిశ్చితార్థంం కోసం తాను ఎలా ముస్తాబు అయింది... ఏవరెవరు వచ్చారు, ఫంక్షన్ ఎలా జరిగింది వంటి వాటన్నిటినీ వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనుకోకుండా ఈ పెళ్లి కుదిరిందని.. త్వరలోనే తను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది.

అలాగే తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇలా అన్ని వీడియోలు షేర్ చేస్తున్న ఈమె.. తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరి పెళ్లి రోజు అయినా అతడి మొహాన్ని రివీల్ చేస్తుందా లేక అలాగే దాచి పెడుతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా గతంలో ఓసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఈమె.. రెండోసారి అయినా భర్తతో హాయిగా గడపాలని చాలా మంది కోరుకుంటున్నారు. అదే విషయాన్ని కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X