RGV: బర్రెలక్కపై వర్మ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు... నోరు జారితే తస్మాత్ అంటూ వార్నింగ్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా విడుదల ఆపాలంటూ టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆ విషయం పక్కన పెడితే... బర్రెలక్కపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో... ఆమె ఆర్జీవీపై కేసు వేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఆయన సినిమా తీస్తే.. సూపర్ హిట్టుగా నిలిచేది. ఇప్పుడు మాత్రం ఆయన వివాదం అయ్యే అవకాశం ఉన్న సినిమాలే చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా ఆయన వ్యూహం అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 29న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది.

Barrelakka Files A Case Against on Director Ram Gopal Varma At Womens Commission

ఇక ఆ విషయం పక్కన పెడితే... వ్యూహం సినిమా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. అయితే ఈ ఈవెంట్లో.. రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల మీద కేసు నమోదు అయిందని తెలుస్తోంది. బర్రెలక్క అలియాస్ శిరీష చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఈమె పేరు మాత్రం బాగానే పాపులర్ అయింది.

శిరీష అలియాస్ బర్రెలక్క తరపు లాయర్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో కేసు నమోదు చేశారు. స్టేట్ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు అనంతరం ఆయన మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అంటూ చెప్పుకువచ్చారు. అందుకే ఆయనపై కేసు నమోదు చేసినట్లు చెప్పుకువచ్చారు.

Barrelakka Files A Case Against on Director Ram Gopal Varma At Womens Commission

ఇంతకీ రామ్ గోపాల్ వర్మ బర్రెలక్కను ఏం అన్నారంటే... ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది.. బర్రెలెక్క కాస్త ఉంటుంది... అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని రామ్ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సదరు లాయర్ చెప్పుకువచ్చారు. ఇలాంటి మాటలు రామ్ గోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు... కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలా చెయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ విషయం మీద మరింత పోరాటం చేస్తామని... ఇలాంటి మాటలు వద్దు ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతామంటూ హెచ్చరించారు లాయర్. ఇక ఈ విషయంపైనే ఆర్జీవీపై మహిళా కమిషన్ లో బర్రెలక్క తరుపున లాయర్ కేసు నమోదు చేేశారు. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X