twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్రెండ్ ఫీజు కోసం కెమెరా లెన్సులు అమ్మిన సినిమాటోగ్రాఫర్.. బట్టల రామస్వామి బయోపిక్కు హీరో షాకింగ్ విషయం

    |

    లాక్‌డౌన్‌లో ప్రేక్షకులకు వినోదం పంచిన చిత్రాల్లో బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రం ఒకటిగా చెప్పుకోవచ్చు. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. జీ5 ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకొంటున్నది. గ్రామీణ నేపథ్యంతో తెలుగు నేటివిటికి తగినట్టుగా రూపొందిన ఈ మూవీని ప్రేక్షకులే కాకుండా సినీ విమర్శకులు కూడా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో బట్టల రామస్వామి బయోపిక్కు హీరో అల్తాఫ్ హసన్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

    తన పుట్టింది అనంతపురం జిల్లాలో అయినప్పటికీ.. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల అన్ని జిల్లాలు తిరుగాల్సి వచ్చింది. అయితే తనకు థియేటర్ వైపు ఆసక్తి ఉండటంతో ఇంట్లో చెప్పకుండా ఈ కోర్సు చేశాను. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నాకు తెలిసిన వ్యక్తి పీజీ విందా మాత్రమే. ఆ సమయంలో పీజీ విందా జేఎన్‌టీయూలో ఫొటోగ్రఫీ కోర్సు చేస్తున్నారు. మొదటి నుంచి నన్ను బాగా ప్రోత్సహించే వారు. నేను సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించే థియేటర్‌ ఆర్ట్స్ కోర్సులో చేరాల్సి ఉంది. కానీ డబ్బులు లేకపోవడంతో పీజీ విందా తన కెమెరా లెన్స్‌లు అమ్మి నా ఫీజు కట్టారు. దాంతో నేను థియేటర్ ఆర్ట్స్ పీజీ చేశాను. ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా పూర్తి చేసి డాక్టరేట్ అందుకొన్నాను అని అల్తాఫ్ చెప్పారు.

    Battala ramaswamy biopic fame Altaf Hassan about PG Vinda Help

    బట్టల రామస్వామి బయోపిక్కులో ఆఫర్ గురించి వెల్లడిస్తూ.. పలు ఆడిషన్ల తర్వాత దర్శకుడు రామ్ నారాయణ్ నాకు అవకాశం ఇచ్చారు. పాత్ర గురించి డైరెక్టర్ తీసుకొన్న జాగ్రత్తల వల్లే నాకు మంచి గుర్తింపు లభిస్తున్నది. సినిమా రిలీజ్ తర్వాత నాకు చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తున్నారు అని అల్తాఫ్ చెప్పారు. బట్టల రామస్వామి సక్సెస్ తర్వాత పలు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. వాటి గురించి పలువురితో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు.

    ఇక సినిమాటోగ్రాఫర్ పీజీ విందా విషయానికి వస్తే... గ్రహణం చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. అష్టాచెమ్మా, వినాయకుడు, అంతకుముందు.. ఆ తర్వాత, రోమియో, లోఫర్, జెంటిల్మన్, అమీ తుమీ, సమ్మోహనం, వీ లాంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు.

    English summary
    Battala ramaswamy biopic movie is getting huge response in Zee5 OTT, After good success, Hero Altaf Hassan speaks to Filmibeat Telugu exclusively. He revealed a help from PG Vinda make his life turn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X