Dunki: డంకీ సినిమా చూడాలంటే ఆ అర్హత ఉండాల్సిందేనట.. లేకుండా వెళ్తే ఇక అంతే సంగతులు!
బాలీవుడ్ బాద్ షా హీరోగా తాజాగా రాబోతున్న చిత్రం డంకీ. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో తాస్పీ పన్ను హీరోయిన్ గా నటించబోతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే క్రిస్మస్ పండుగ సందర్బంగా డిసెంబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ చిత్రం గ్రాండ గా విడుదల కాబోతుంది. ఆ తర్వాతి రోజే అంటే డిసెంబర్ 22వ తేదీ రోజే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సలార్ సినిమా కూడా విడుదల కాబోతుంది. అయితే రెండు పెద్ద హీరోల చిత్రాలు ఒక్క రోజు తేడాలోనే విడుదల కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పేలా లేదని అర్థం అవుతుంది. ఇప్పటికే సలార్ తో పాటు డంకీకి పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడంతో మరింత ఉత్కంఠ రేకెత్తుతోంది.
రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం, రాజ్ కుమార్ ఫిల్మ్స్, జియో స్డూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాగీ, జ్యోతి దేశ్ పాండేలు నిర్మిస్తున్నారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో కనిపించబోతుండగా.... ప్రీతమ్, అమాన్ లు సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా చూసే వాళ్లకు కొన్ని కండీషన్స్ పెట్టింది బీఎఫ్ఎఫ్సీ. ఆ అర్హత ఉన్న వాళ్లు మాత్రమే ఈ సినిమాను చూడాలని చెప్పింది. అయితే ఆ అర్హత ఏంటి, ఎందుకలా పెట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

షారుఖ్ ఖాన్ హీరోగా రాబోతున్న డంకీ సినిమాకు డిసెంబర్ 15వ తేదీన సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే రన్ టైమ్ ను 161.24 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. అంటే 2 గంటల 41 నిమిషాలు 24 సెకండ్లు. అయితే తాజాగా బీబీఎఫ్ సీ 15 ప్లస్ రేటింగ్ ఇచ్చింది. అంటే 15 ఏళ్లకు పైబడిన వారు మాత్రమే ఈ సినిమా చూడాలి. అంతకంటే తక్కువ ఉన్న వాళ్లు చూడకూడదు అని వివరించింది. యాక్షన్ కంటెంట్ ఆధారంగా బ్రిటీష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ అయిన బీబీఎఫ్ 15 ప్లస్ ఇవ్వడం గమనార్హంగా మారింది.

మరోవైపు డంకీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగనే సాగుతోంది. ఇప్పటి వరకు డంకీ సినిమాకు సంబంధించిన 2 లక్షల 46 వేల 900 టికెట్లు ప్రీ బుకింగ్స్ జరగ్గా... రూ.7.51 కోట్ల ప్రీరిలీజ్ జరిగినట్లు సమాచారం. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించి ఎంత మేర కలెక్షన్లను సాధిస్తుందనేది.


Click it and Unblock the Notifications











