వైరల్ ట్వీట్ : వామ్మో చిరంజీవి మామూలోడు కాదు.. ‘ఛాలెంజ్’ను స్వీకరించడంలోనూ స్టైలే!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ చాలెంజ్ నడుస్తోంది. ఈ క్వారంటైన్, లాక్ డౌన్ సమయంలో మగవారు కూడా ఇంటి పనులను చేయాలని, మహిళలకు అండగా నిలబడాలని ఓ ఛాలెంజ్ నడుస్తోంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదలు పెట్టిన ఈ చాలెంజ్ ప్రస్తుతం ఫుల్ ఫేమస్ అవుతోంది. నిజమైన మనిషిగా అనిపించుకోండంటూ ఇంట్లోని పనులు చేస్తూ వీడియోలు షేర్ చేయాలని మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్ శరవేగంగా విస్తరిస్తోంది.

దర్శకధీరుడికి సవాల్..

నిజమైన మనిషి అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టాడు. మహిళలను ఇలాంటి కష్టకాలంలో మరింత కష్టపెట్టకూడదని, ఇంటి పనులు చేస్తూ సాయపడాలని అప్పుడే నిజమైన మనుషులవుతారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇంటి పనులు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశాడు. దీంతో పాటు రాజమౌళికి సవాల్ విసిరి ముందుకు కొనసాగించాల్సిన బాధ్యతను అప్పగించాడు.

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు..

దర్శకధీరుడు రాజమౌళి ఆ సవాల్‌ను స్వీకరించి ఇంటి పనులను చేశాడు. నేలను, కిటికీలను శుభ్రం చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్, శోభు యార్లగడండ, సుకుమార్, కీరవాణిలకు ఛాలెంజ్ విసిరాడు. ఈ మేరకు ఆ సవాళ్‌ను ఎన్టీఆర్ స్వీకరించాడు.

చిరు, బాలయ్య, నాగ్, వెంకీలకు..

రాజమౌళి విసిరిన సవాల్‌ను ఎన్టీఆర్ స్వీకరించాడు.ఇంట్లో, ఇంటి బయట ఊడుస్తూ రియల్ మ్యాన్ అనిపించుకున్నాడు. తదుపరి ఈ సవాల్‌ను సీనియర్ హీరోలందరికీ విసిరాడు. బాబాయ్ బాలయ్య, చిరంజీవి, నాగ్ బాబాయ్, వెంకీమామ, కొరటాల శివ ఇలా సీనియర్లకు ఛాలెంజ్‌ను విసిరాడు.

Recommended Video

#BetheREALMAN : Watch How RRR Movie Team Accepted The 'Be The Real Man' Challenge

సోషల్ మీడియాలో చిరు దూకుడు..

సోషల్ మీడియాలో చిరంజీవి ఎంతలా రెచ్చిపోతోన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరికీ పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తూనే ఉన్నాడు. మోహన్ బాబు, పూలు పళ్లు అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును, బ్యాంకాక్ బీచ్ అంటూ పూరిని ఇలా ప్రతీ ఒక్కర్నీ ఆడేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ రామరాజు కోసం భీమ్ విడుదలయ్యేప్పుడు కూడా ఖైదీ నెంబర్150 నుంచి వెయిటింగ్ అనే డైలాగ్‌ను ఎడిట్ చేసి పెట్టాడు.

ఛాలెంజ్‌ను నాటి ‘ఛాలెంజ్‌'తో పోల్చుతూ..

ఛాలెంజ్‌ను నాటి ‘ఛాలెంజ్‌'తో పోల్చుతూ..

తాజాగా చిరు చేసిన మరో ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై చిరు ఎంత రఫ్పాడిస్తాడో.. సోషల్ మీడియాలో అంతకు మించి అన్నట్టుగా చేసేస్తున్నాడు. ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టుగా.. నాటి ఛాలెంజ్ సినిమాలోని సీన్‌ను టైటిల్‌ను షేర్ చేశాడు. అంతేకాకుండా నీ క్రైమ్ పార్ట్నర్ రామ్ చరణ్ వీడియో కోసం కూడా వెయిటింగ్ అంటూ మళ్లీ ఓ పంచ్ వేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X