కేటీఆర్‌ను ఇరుకున పెట్టిన చిరంజీవి..సూపర్ స్టార్‌నూ వదల్లేదు..ఫ్యాన్స్ విన్నపాన్ని పట్టించుకోని చిరు

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. కరోనా వేళ అందరూ ఇంటి పట్టునే ఉండటంతో మహిళలపై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారికి ఆసారాగా మగవారు నిలబడి నిజమైన మనిషి అనిపించుకోవాలని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీపర్ రెడ్డి వంగా ఓ ఛాలెంజ్‌ను మొదలు పెట్టాడు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోకి కూడా చేరింది. తాజాగా చిరంజీవి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి..ఇంట్లో పనులు చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ తన మిత్రులను నామినేట్ చేశాడు. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

దర్శకధీరుడికి సవాల్..

దర్శకధీరుడికి సవాల్..

నిజమైన మనిషి అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టాడు. మహిళలను ఇలాంటి కష్టకాలంలో మరింత కష్టపెట్టకూడదని, ఇంటి పనులు చేస్తూ సాయపడాలని అప్పుడే నిజమైన మనుషులవుతారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇంటి పనులు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశాడు. దీంతో పాటు రాజమౌళికి సవాల్ విసిరి ముందుకు కొనసాగించాల్సిన బాధ్యతను అప్పగించాడు.

అక్కడి నుంచి అలా...

అక్కడి నుంచి అలా...

దర్శకధీరుడు రాజమౌళి ఆ సవాల్‌ను స్వీకరించి ఇంటి పనులను చేశాడు. అక్కడి నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ అక్కడి నుంచి ఎన్టీఆర్ ద్వారా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య వంటి హీరోలకు చేరింది. దర్శకుల్లో రాజమౌళి సుకుమార్‌కు, ఎన్టీఆర్ కొరటాలకు, సుకుమార్ వంశీ పైడి పల్లి, దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్‌లకు ఇలా సవాళ్లు విసిరారు.

 సవాళ్లను పూర్తి చేసిన సుకుమార్, కొరటాల..

సవాళ్లను పూర్తి చేసిన సుకుమార్, కొరటాల..

ఎన్టీఆర్ విసిరిన వారిలో సుకుమార్, కొరటాల పూర్తి చేశారు. సుకుమార్ తదుపరి బాధ్యతను దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్, వంశీ పైడీపల్లి, కొరటాలకు ఇచ్చాడు. అయితే కొరటాల ఎన్టీఆర్ సవాల్‌ను స్వీకరించి విజయ్ దేవరకొండకు ఛాలెంజ్ విసిరాడు. ఎన్టీఆర్ లిస్ట్‌లో మిగిలిన పోయిన చిరంజీవి నిన్న రియాక్ట్ కాగా, వెంకటేష్ తాజాగా స్పందించాడు.

రంగంలోకి వెంకీమామ

ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టుగా వెంకటేష్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే ముందుగా గ్యాంగ్ లీడర వీడియో కోసం వెయిటింగ్ అంటూ వెంకటేష్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా వెంకీమామ సినిమాలోని ఓ జిఫ్ ఫైల్‌ను కూడా షేర్ చేశాడు. ఇక నాగార్జున, బాలయ్య బాబు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

Recommended Video

#BetheREALMAN : Watch How RRR Movie Team Accepted The 'Be The Real Man' Challenge
చిరు వీడియో..

చిరు వీడియో..

ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరు.. ఇంటి పనులను చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. రోజూ చేసే పనే అయినా ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ ఇంటిని శుభ్రం చేయడం, దోశలు వేయడం, ప్రేమగా అమ్మ అంజనాదేవీకి వడ్డించడం, ప్రేమతో కొడుక్కి తినిపించడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ తదుపరి ఛాలెంజ్‌ను కేటీఆర్, సూపర్ స్టార్ రజినీకాంత్‌లకు విసిరాడు. అయితే పవన్ కళ్యాణ్‌ను నామినేట్ చేయండని మెగా ఫ్యాన్స్ చేసిన విన్నపాన్ని చిరు ఏమాత్రం పట్టించుకోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X