వెతికిమరీ పట్టుకుని ఛాలెంజ్ విసిరాడు.. ఆ డైరెక్టర్‌ను బుక్ చేసిన మెగాస్టార్

సోషల్ మీడియాలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి మెగా ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. చిరు చేసే ట్వీట్స్, వేసే సెటైర్స్ సోషల్ మీడియాలో ఫన్‌ను క్రియేట్ చేస్తున్నాయ్. చిరు టైమింగ్‌ను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. చిరు వేసే ప్రతీ ట్వీట్‌లో ఏదో ఒక హాస్య చతురత ఉంటుంది. సోషల్ మీడియాలోకి లేటుగా వచ్చినా సరే.. ఓ ఊపు ఊపేస్తున్నాడు. యూత్ సైతం షాక్ అయ్యేలా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు.

చిరు దూకుడును చూసిన నెటిజన్లు దెబ్బకు షాక్ అవుతున్నారు. ఏంటి ఈ స్పీడ్, అందరికీ ఇలా పంచ్‌లు వేసేస్తున్నాడేంటి? అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, రాఘవేంద్రరావు, రాజమౌళి, పూరి జగన్నాద్ వంటి వారికి తనదైన శైలిలో సెటైర్స్ వేశాడు. ఈ మధ్య వైరల్ అవుతున్న ఛాలెంజ్‌ను కూడా స్వీకరిస్తూ చేసిన ట్వీట్, వెంకటేష్‌కు ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది.

Be The Real Man Chiranjeevi Throws Challenge To Mani Ratnam

ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరు.. ఇంటి పనులు, వంట పనులు చేస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో అమ్మ ప్రేమతో పాటు, కుకింగ్‌లో చిరు నైపుణ్యానికి అంతా ఫిదాఅయ్యారు. ఆ దోశను తిప్పడంపై అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మొదటగా కేటీఆర్, రజినీకాంత్‌లకు అప్పగించాడు. మరి కాసేపటికి ట్వీట్ చేస్తూ.. మణి సర్‌ను వెతికి పట్టాను ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఎక్కడ ఉందా? అని అంటూ మద్రాస్ టాకీస్‌ను ట్యాగ్ చేస్తూ.. మణిరత్నంకు కూడా సవాల్ విసిరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X