ప్లీజ్ పవన్‌ను నామినేట్ చేయండి.. మెగాస్టార్‌కు విన్నపం.. చిరు దూకుడుకు ఫ్యాన్స్ పరేషాన్

సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి దూకుడు చూసి విస్మయం చెందని నెటిజన్ ఉండండు. 60 యేళ్ల వయస్సులో ఈ ఎనర్జీని చూస్తున్న నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇరవై యేళ్ల కుర్రాడు కూడా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండలేకపోతోన్నారంటే అతిశయోక్తి కాదు. చిరు టైమింగ్, వేసే పంచ్‌లకు అంతా ఫిదా అవుతున్నారు.

మొదటి నుంచీ పంచ్‌లే..

మొదటి నుంచీ పంచ్‌లే..

ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. నాటి నుంచి ట్వీట్లతో దడదడలాడిస్తున్నాడు. ఒక సెక్షన్ జనాలు చిరు పెట్టే ట్వీట్స్ కోసమే ఎదురుచూస్తున్నారంటే నమ్మశక్యం కాదు. అంతలా చిరు ట్వీట్స్ అందర్నీ ఎంటర్టైన్ చేస్తున్నాయి. మోహన్ బాబు, రాఘ వేంద్రరావు, పూరీ జగన్నాద్, రాజమౌళి మీద వేసిన సెటైర్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

Recommended Video

#BetheREALMAN : Watch How RRR Movie Team Accepted The 'Be The Real Man' Challenge
రఫ్పాడిస్తున్న చిరు..

రఫ్పాడిస్తున్న చిరు..

సోషల్ మీడియాను ఎలా వాడాలో ఏ రకంగా వాడితో అందరికీ రీచ్ అవుతామో చిరుకు బాగా తెలిసిపోయింది. ప్రతీ ట్వీట్‌లో ఓ సెటైర్, ఓ పంచ్, ఓ కొత్త విషయాన్ని చెబుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. చిరు టైమింగ్‌ను చూసి.. అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టుగా వేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ఛాలెంజ్ అంటూ ‘ఛాలెంజ్’ వీడియో

ఛాలెంజ్ అంటూ ‘ఛాలెంజ్’ వీడియో


ఎన్టీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టుగా చిరంజీవి తన ఛాలెంజ్ సినిమా నాటి వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు మరో కొత్త విషయాన్ని కూడా తెలిపాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా క్రైమ్ పార్ట్నర్స్ అంటూ హింట్ ఇచ్చాడు. అయితే ఇది ఆర్ఆర్ఆర్ సినిమా పాత్రలను ఉద్దేశించి చేసి ఉండొచ్చు.

పవన్ కళ్యాణ్‌ను నామినేట్ చేయండి..

పవన్ కళ్యాణ్‌ను నామినేట్ చేయండి..


ఇక చిరు చేసిన ఈ ట్వీట్‌కు వచ్చిన కామెంట్స్ చేస్తే చిరంజీవి ఏవిధంగా హల్చల్ చేస్తున్నాడో అర్థం అవుతుంది. మెజార్టీ నెటిజన్లు చిరు టైమింగ్‌ను ఇష్టపడుతున్నారు. చాలా మంది అభిమానులు మాత్రం ఓ విన్నపం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఈ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం చేయండి.. ఆయన్ను నామినేట్ చేయండి.. మీరు తప్ప ఆయన్ను ఎవ్వరూ నామినేట్ చేయలేరంటూ కామెంట్స్ చేశారు. మరి వీరి విన్నపం చిరుకు చేరుతుందో లేదో.. ఆయన ఎవరిని నామినేట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X