ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్న తారక్ అన్నయ్య.. నెలరోజుల పుటేజ్ ఆల్రెడీ మిస్ అయింది.. కొరటాల ట్వీట్ వైరల్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్‌కు వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25లక్షలకు పైగా కరోనా బారిన పడగా..అందులో లక్షకుపైగా ప్రాణాలను కోల్పోయారు. మనదేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. ఇప్పటికే 18వేలమంది కరోనా బారిన పడ్డారు. ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు గత కొన్నిరోజులుగా లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో మహిళలకు మరింత పనిభారం పెరుగుతోంది. వీటిని తగ్గించేందుకు టాలీవుడ్‌లో ఛాలెంజ్ నడుస్తోంది.

 సందీప్ రెడ్డి మొదలు పెట్టిన ఛాలెంజ్..

సందీప్ రెడ్డి మొదలు పెట్టిన ఛాలెంజ్..

నిజమైన మనిషి అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టాడు. తమ మహిళలను ఇలాంటి కష్టకాలంలో మరింత కష్టపెట్టలేరని, ఇంటి పనులు చేస్తూ సాయపడతారని వారే నిజమైన మనుషులంటూ ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు రాజమౌళికి సవాల్ విసిరి ఇక ముందుకు కొనసాగించాల్సిన బాధ్యతను అప్పగించాడు.

స్వీకరించిన దర్శకధీరుడు..

స్వీకరించిన దర్శకధీరుడు..

దర్శకధీరుడు రాజమౌళి ఆ సవాల్‌ను స్వీకరించి ఇంటి పనులను చేశాడు. నేలను, కిటికీలను శుభ్రం చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్, శోభు యార్లగడండ, సుకుమార్, కీరవాణిలకు ఛాలెంజ్ విసిరాడు. ఈ మేరకు ఆ సవాళ్‌ను ఎన్టీఆర్ స్వీకరించాడు.

సీనియర్లకు ఎన్టీఆర్ సవాల్..

రాజమౌళి విసిరిన సవాల్‌ను ఎన్టీఆర్ స్వీకరించాడు.ఇంట్లో, ఇంటి బయట ఊడుస్తూ రియల్ మ్యాన్ అనిపించుకున్నాడు. తదుపరి ఈ సవాల్‌ను సీనియర్ హీరోలందరికీ విసిరాడు. బాబాయ్ బాలయ్య, చిరంజీవి, నాగ్ బాబాయ్, వెంకీమామ, కొరటాల శివ ఇలా సీనియర్లకు ఛాలెంజ్‌ను విసిరాడు.

Recommended Video

సల్మాన్ ఖాన్‌‌ షూటింగ్ రద్దు ! 'చంపేస్తాం' అంటూ బెదిరింపులు..!
ఓకే తారక్ అన్నయ్య..

ఓకే తారక్ అన్నయ్య..

ఎన్టీఆర్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టు కొరటాల శివ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. చాలెంజ్ యాక్సెప్ట్డ్ తారక్ అన్నయ్య.. అయితే నెల రోజుల పుటేజ్ మిస్ అయింది అంటూ ట్వీట్ చేశాడు. ఈ లెక్కన్న కొరటాల గత నెల రోజులుగా ఇంటి పనులు చేస్తున్నాడన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X