Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైరల్ ఛాలెంజ్.. గ్యాంగ్ లీడర్ వీడియో కోసం వెయింటింగ్.. బరిలోకి వెంకీమామ
కరోనా వేళ సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో పిచ్చి చేష్టలతో ఛాలెంజ్‌లు విసురుకుంటూ ఉండగా.. మన టాలీవుడ్ హీరోలు, దర్శకులు మరొక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఇంట్లోని మహిళలక పనిభారం ఎక్కువ అవుతుండటంతో వారికి సాయ పడి నిజమైన మనిషి అనిపించుకోవాలని ఓ ఛాలెంజ్ నడుస్తోంది. దీనికి ఆద్యుడు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
దర్శకధీరుడికి సవాల్..
నిజమైన మనిషి అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టాడు. మహిళలను ఇలాంటి కష్టకాలంలో మరింత కష్టపెట్టకూడదని, ఇంటి పనులు చేస్తూ సాయపడాలని అప్పుడే నిజమైన మనుషులవుతారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇంటి పనులు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశాడు. దీంతో పాటు రాజమౌళికి సవాల్ విసిరి ముందుకు కొనసాగించాల్సిన బాధ్యతను అప్పగించాడు.
అక్కడి నుంచి అలా...
దర్శకధీరుడు రాజమౌళి ఆ సవాల్‌ను స్వీకరించి ఇంటి పనులను చేశాడు. నేలను, కిటికీలను శుభ్రం చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్, శోభు యార్లగడండ, సుకుమార్, కీరవాణిలకు ఛాలెంజ్ విసిరాడు. ఈ మేరకు ఆ సవాళ్ను ఎన్టీఆర్ స్వీకరించాడు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య, కొరటాలకు సవాల్ విసిరాడు.
|
సవాళ్లను పూర్తి చేసిన సుకుమార్, కొరటాల..
ఎన్టీఆర్ విసిరిన వారిలో సుకుమార్, కొరటాల పూర్తి చేశారు. సుకుమార్ తదుపరి బాధ్యతను దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్, వంశీ పైడీపల్లి, కొరటాలకు ఇచ్చాడు. అయితే కొరటాల ఎన్టీఆర్ సవాల్‌ను స్వీకరించి విజయ్ దేవరకొండకు ఛాలెంజ్ విసిరాడు. ఎన్టీఆర్ లిస్ట్‌లో మిగిలిన పోయిన చిరంజీవి నిన్న రియాక్ట్ కాగా, వెంకటేష్ తాజాగా స్పందించాడు.
|
ఛాలెంజ్‌ను నాటి ‘ఛాలెంజ్'తో పోల్చుతూ..
తాజాగా చిరు చేసిన మరో ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై చిరు ఎంత రఫ్పాడిస్తాడో.. సోషల్ మీడియాలో అంతకు మించి అన్నట్టుగా చేసేస్తున్నాడు. ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టుగా.. నాటి ఛాలెంజ్ సినిమాలోని సీన్‌ను టైటిల్‌ను షేర్ చేశాడు. అంతేకాకుండా నీ క్రైమ్ పార్ట్నర్ రామ్ చరణ్ వీడియో కోసం కూడా వెయిటింగ్ అంటూ మళ్లీ ఓ పంచ్ వేసేశాడు.
వెంకీమామ స్టైల్లో సవాల్‌ను స్వీకరించిన విక్టరీ..
ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టుగా వెంకటేష్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే ముందుగా గ్యాంగ్ లీడర వీడియో కోసం వెయిటింగ్ అంటూ వెంకటేష్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా వెంకీమామ సినిమాలోని ఓ జిఫ్ ఫైల్‌ను కూడా షేర్ చేశాడు. ఇక నాగార్జున, బాలయ్య బాబు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.