బరిలోకి వెంకీమామ.. చిన్నోడికి పెద్దోడి సవాల్.. మరి ఛాలెంజ్‌ను అంగీకరిస్తాడా?
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదలు పెట్టిన ఛాలెంజ్ వైరల్ అవుతోంది. కరోనా వేళ ఇంట్లో పని భారంతో కష్టపడుతున్న మహిళలకు సాయం చేయాలని నిజమైన మనిషి అని అనిపించుకోండని ఓ ఛాలెంజ్‌ను విసిరాడు. ఇంటిని శుభ్రం చేస్తూ ఇంటి పనుల్లో సాయం చేస్తోన్న వీడియోను షేర్ చేశాడు. ఇక ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను దర్శకధీరుడు రాజమౌళి మీద పెట్టాడు. అలా మొదలైన ఛాలెంజ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అలా అలా ముందుకు సాగుతూ సీనియర్ హీరోల వరకు వెళ్లింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు..
దర్శకధీరుడు తన శ్రీమతికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేశాడు. ఈ మేరకు రామ్ చరణ్, ఎన్టీఆర్, శోభు యార్లగడ్డ, కీరవాణి, సుకుమార్ వంటివారికి బాధ్యతను అప్పగించాడు. అక్కడి నుంచి అలా ముందుకు సాగుతూనే ఉంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్, కొరటాల..
అలా ఎన్టీఆర్, రామ్ చరణ్, కొరటాల, సుకుమార్, కీరవాణి మొదలగు వారు సవాళ్లను స్వీకరించాడు. తదుపరి పేర్లను కూడా నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సీనియర్ హీరోలకు ఎక్కుపెట్టాడు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కొరటాల వంటివారికి ఛాలెంజ్ విసిరాడు.
కాసేపటి క్రితమే చిరు..
ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను కాసేపటి క్రితమే చిరంజీవి పూర్తి చేసేశాడు. ఇంట్లోని పని చేస్తూ.. తనకెంతో ఇష్టమైన దోశను వేసి.. అమ్మ అంజనాదేవీకి ప్రేమగా వడ్డించాడు. ఇక తదుపరి టాస్క్‌ను కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నంలకు అప్పగించాడు.
Recommended Video

చిన్నోడి పెద్దోడి సవాల్..
ఇక ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఇంట్లో పనుల చేశాడు. కూరగాయాలు తరిగి వంటి చేసి ఇంటి పనుల్లో భాగం పంచుకున్నాడు. ఈ మేరకు వీడియోను షేర్ చేస్తూ.. చిన్నోడు (మహేష్ బాబు)కు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడికి సవాల్‌ను విసిరాడు. మరి అసలే ఇలాంటి వాటికి దూరంగా ఉండే ప్రిన్స్ అలా పనులు చేస్తాడా? సవాల్‌ను స్వీకరిస్తాడా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











