NTR30: ఎన్టీఆర్ మూవీ నుంచి షాకింగ్ లీక్.. ఇండియాలోనే తొలిసారి ఆ సీక్వెన్స్

టాలీవుడ్‌లో పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనదైన టాలెంట్లతో ఆరంభంలోనే అదిరిపోయే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా మొదట్లోనే ఎన్నో విజయాలను కూడా అందుకున్నాడు. అయితే, మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన తారక్.. 'టెంపర్' మూవీ నుంచి వరుసగా హిట్లు మీద హిట్లను ఖాతాలో వేసుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే RRR (రౌద్రం రణం రుధిరం)తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగాడు. దీనికితోడు ఆస్కార్ రేసులో నిలిచి ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు.

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు. కానీ, ఈ మూవీ మాత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రకటనకే పరిమితం అయిందని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్లను వెతకడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక, న్యూ ఇయర్ రోజు ఏకంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.

Beach Fight Highlight in NTR and Koratala Movie

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీని ఫిబ్రవరిలో అధికారికంగా ప్రారంభించి.. మార్చి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుతామని జూనియర్ ఎన్టీఆర్ 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించాడు. ఇక, ఈ సినిమా కోసం శంషాబాద్‌లో ఒక సెట్, గోవాలో మరో సెట్ వేస్తున్నారు. మొదటి షెడ్యూల్ ఇక్కడ, రెండోది అక్కడ ప్లాన్ చేశారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. గోవాలో జరిగే షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారట. ఇది ఇండియాలో ఏ సినిమాలోనూ చూపించని విధంగా డిజైన్ చేశారని తెలిసింది. దీంతో ఈ సీక్వెన్స్ సినిమాలో హైలైట్ కాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసే ఛాన్స్ ఉంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X