Niharika wedding: పవన్ కళ్యాణ్ భార్య ఎందుకు వెళ్లలేదంటే..?

మెగా ఫ్యామిలీ చాలా రోజుల తరువాత ఒక బిగ్ సెలబ్రేషన్ తో చాలా ఆనందంగా కనిపించింది. నిహారిక పెళ్లి వేడుకలో మెగా హీరోలు మొత్తం పాల్గొన్నారు. బుధవారం ముహూర్తం సమయానికి హిందు సంప్రదాయం ప్రకారం చైతన్య జొన్నలగడ్డ, నిహారిక మెడలో ముడు ముళ్ళు వేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే వేడుకకు పవన్ భార్య అన్నా లెజ్‌నేవా ఎందుకు రాలేదు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే అందుకు ఒక కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

 పెళ్లి వేడుకలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు

పెళ్లి వేడుకలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు, సన్నీహితులు మొత్తం కలిపి దాదాపు వంధ మందికి పైగానే నిహారిక పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. మెగా యువ హీరోలతో పాటు అల్లు బ్రదర్స్ కూడా ఈవెంట్ లో సందడి చేశారు. వారికి సంబంధించిన చాలా ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. పెళ్లికి రెండు రోజుల ముందే కుటుంబ సభ్యులు మొత్తం ఉదయ్ పూర్ ప్యాలెస్ కు చేరుకున్న విషయం తెలిసిందే.

 కొడుకు కూతురితో పవన్ కళ్యాణ్

కొడుకు కూతురితో పవన్ కళ్యాణ్

ఇక పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా ఒక రోజు ముందు ఎంట్రీ ఇచ్చాడు. ఇదివరకే నిహారిక నిశ్చితార్థ వేడుకని మిస్సయిన పవన్ కళ్యాణ్ ఈ సారి మాత్రం ఒక రోజు ముందే వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. పెద్ద కొడుకు అకిరా నందన్, కూతురు ఆధ్యలతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో ఉదయ్ పూర్ కు చేరుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

 అన్నా లెజ్‌నేవా పెళ్లికి రాకపోవడంతో..

అన్నా లెజ్‌నేవా పెళ్లికి రాకపోవడంతో..

అయితే పవన్ భార్య అన్నా లెజ్‌నేవా పెళ్లికి రాకపోవడంతో సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. అన్నా లెజ్‌నేవా గతంలో చాలాసార్లు మెగా ఫ్యామిలీకి చెందిన ఈవెంట్స్ లలో పాల్గొంది. శ్రీజ పెళ్లిలో కూడా ఆమె ముందుండి చిన్న కోడలిగా వివిధ పనులలో కూడా పాల్గొంది. తెలుగు నేర్చుకోవడమే కాకుండా పవన్ కోసం ఆమె పూర్తిగా హిందు సంప్రదాయాలను కూడా పాటిస్తోంది.

అసలు కారణం ఇదే..

అసలు కారణం ఇదే..

ఇక అన్నా లెజ్‌నేవా పెళ్లికి రాకపోవడానికి అసలు కారణం ఆమె ఇండియాలో లేదు. గత కొన్ని రోజుల క్రితం పిల్లలతో కలిసి రష్యాకు వెళ్లింది. ప్రతి ఏడాది డిసెంబర్ సమయంలో క్రిస్మస్ సందర్భంగా రష్యాకు వెళుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా అత్తారింటికి వెళ్ళాడు. అందుకే పెళ్లికి హాజరుకాలేకపోయినట్లు సమాచారం.

Recommended Video

Niharika Konidela wedding : All Mega Heroes In one Frame
పెళ్లి కూతురి కొసం స్పెషల్ గిఫ్ట్

పెళ్లి కూతురి కొసం స్పెషల్ గిఫ్ట్

అయితే పెళ్లికి హాజరు కాలేకపోయినప్పటికి అన్నా లెజ్‌నేవా పెళ్లి కూతురి కొసం ఒక ప్రత్యేకమైన బహుమతిని పంపినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఒక డ్రెస్ డిజైన్ చేయించి పెళ్లికి బహుమతిగా పంపినట్లు టాక్. ఇక నిహారిక కోసం పెళ్లి కానుకలు చాలానే వచ్చాయట. మెగా హీరోలు కూడా ఖరీదైన కానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బహుమతుల విలువ మొత్తం

రూ.5కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X