మెగాస్టార్ ప్రాజెక్ట్ నుంచి సాహో దర్శకుడు తప్పుకోవడానికి కారణమిదే..
మెగాస్టార్ చిరంజీవి యువ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక దర్శకుడి టాలెంట్ నచ్చితే మెగా హీరోలకు అతనితో సినిమా చేయండని సలహాలు కూడా ఇస్తారు. ఇక ఆయన రీ ఎంట్రీ తరువాత చాలా మంది దర్శకులకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్స్ ని పట్టించుకోకుండా కూడా టాలెంట్ ని నమ్మి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇస్తున్నారని చాలా మంది దర్శకులు సరికొత్త కథలతో మెగా కాంపౌండ్ ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక సాహో సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సుజిత్ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. మలయాళం హిట్ మూవీ లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేయాలని మెగాస్టార్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ అవకాశాన్ని సుజిత్ కి ఇవ్వగా పర్సనల్ రీజన్స్ వల్ల తప్పుకున్నాడు. మొదట సుజిత్ రాసుకున్న తెలుగు వెర్షన్స్ పై మెగాస్టార్ అసహనం వ్యక్తం చేశాడని అందుకే క్యాన్సిల్ అయినట్లు టాక్ వచ్చింది.

కానీ అతను పెళ్లి కారణంగానే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక మెగాస్టార్ కూడా అతన్ని ఇబ్బంది పెట్టకుండా సీనియర్ డైరెక్టర్ వివి.వినాయక్ కి ఆ ప్రాజెక్టును షిఫ్ట్ చేసినట్లు టాక్. దాదాపు వినాయక్ ఆ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక తెలుగు ఆడియేన్స్ అభిరుచికి తగ్గట్లుగా భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రామ్ చరణ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక మరో సీనియర్ నిర్మాత ఎన్వీ. ప్రసాద్ కూడా రామ్ చరణ్ తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











