పవన్ కళ్యాణ్ నిర్మాతల వెనుక అసలు రహస్యం.. బండ్ల గణేష్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణమిదే!

నిజానికి ఒక వైపు రాజకీయాలు, మరోవైపు సినిమా కెరీర్ అంటే అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ కూడా అలానే అనుకోని ఇన్నాళ్లు పాలిటిక్స్ తోనే బిజీ అయ్యాడు. అజ్ఞాతవాసి అనంతరం నిజానికి పవన్ సినిమాల వైపు చూడవద్దని అనుకున్నాడు. కానీ రాజకీయాల్లో ఇంకా సరైన స్థానం దొరకకపోవడంతో ఆర్థికంగా బలంగా ఉండడానికి మళ్ళీ యూ టర్న్ తీసుకోక తప్పలేదు. ఫైనల్ గా ఆయన వకీల్ సాబ్ సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

కరోనా లేకపోయి ఉంటే..

కరోనా లేకపోయి ఉంటే..

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు. ఎలాంటి సమయంలోనైనా అలెర్ట్ గా ఉండకపోతే ఆ తరువాత ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆ విషయంపై కూడా చాలా ఆలోచించే సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు. అసలు కరోనా లేకపోయి ఉంటే పవన్ వీలైనంత వరకు ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేసేవారు.

అర్థం చేసుకున్న వారితోనే సినిమా..

అర్థం చేసుకున్న వారితోనే సినిమా..

అసలు మ్యాటర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటున్న కథలపై ఎలా ఆలోచిస్తున్నాడు అనే విషయం కన్నా కూడా ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న నిర్మతల విషయంలో మాత్రం చాలానే ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది. వీలైనంత వరకు తనకు క్లోజ్ గా ఉన్న వారితోనే సినిమాలు చేస్తున్నాడు. పాలిటిక్స్ లో పరిస్థితుల ప్రభావం వలన షూటింగ్ డేట్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉండవచ్చు. అందుకే తన పరిస్థితిని అర్థం చేసుకున్న వారితోనే పవన్ సినిమా చేస్తున్నాడు.

వాళ్ళందరూ పవన్ కోసమే..

వాళ్ళందరూ పవన్ కోసమే..

దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ పరిస్థితి అర్థం చేసుకొని దిల్ రాజు సొంతంగా పింక్ రీమేక్ ని సజెస్ట్ చేశాడు. ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా నిర్మాణ సంస్థ సూర్య మూవీస్ తో పవన్ కి 20 ఏళ్లుగా అనుబంధం ఉంది. మరోవైపు హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ పవన్ కి చాలా క్లోజ్. సీతారా ఎంటర్టైన్మెంట్స్ కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అనే విధంగా ఎదురుచూసింది.

బండ్లగణేష్ మూవీ అప్పుడే..

బండ్లగణేష్ మూవీ అప్పుడే..

ఫైనల్ గా తన పొలిటికల్ కెరీర్ ని అర్థం చేసుకొని అందుబాటులో ఉన్నపుడే కాల్షీట్స్ అడ్జస్ట్ చేసుకునేవారికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మెయిన్ గా బండ్ల గణేష్ కి ఆఫర్ ఇచ్చింది కూడా అందుకే. గబ్బర్ సింగ్ హిట్టు తరువాత పవన్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఇక ఫైనల్ గా జనవరి, ఫిబ్రవరి టైమ్ లో వీలైనంత వరకు షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని ఇటివల పవన్ క్లారిటీ ఇచ్చినట్లు టాక్.

నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా పవన్ ప్లాన్

నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా పవన్ ప్లాన్

మొదట ఈ కాంబినేషన్ ఇప్పట్లో సెట్టవ్వదు అని రూమర్స్ వచ్చాయి. కానీ పవన్ , బండ్ల గణేష్ రెగ్యులర్ గా కలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కారులోనే బండ్ల గణేష్ తో పవన్ కథలపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కూడా సెట్ చేసుకున్నట్లు టాక్. ఫైనల్ గా పవన్ నిర్మాతలను వీలైనంత వరకు ఇబ్బంది పెట్టకుండా వచ్చే ఎన్నికలకు ఏడాది ముందే సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X