హుషారు మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.. బెక్కం వేణుగోపాల్
టాలివుడ్ ప్రముఖ నిర్మాత అయిన శ్రీ బెక్కం వెణుగోపాల్ స్వీయనిర్మాణ సంస్థ "లక్కిమీడియా" లో నిర్మిస్తున్న చిత్రం "హుషారు"...
అందాలరాక్షసి, అర్జున్ రెడ్డ్డి సినిమాలతో సంగీతం లో కొత్త ఒరవడి సృస్టించిన రాధన్, దేవదాస్, శైలజారెడ్డి అల్లుడు, నవాబ్ సినిమాల్లో ప్లేబాక్ సింగర్ గా పాపులారిటీ సంపాదించిన సిద్ శ్రీరాం ఇద్దరి మ్యూజికల్ కాంబినేషన్ లో వస్తున్నది.
సిద్ శ్రీరాం రీసెంట్ గా పాడిన గీతాగోవిందం లోని ఇంకేం.. ఇంకేం.. కావాలే... పాట 40మిలియన్ వ్యూస్ ని దాటి తెలుగు సినిమా సంగీతం లో సరికొత్త రికార్డును సృస్టించింది. మొదటిసారిగా, రాధన్ మరియు శ్రీరాం కలయికలో వస్తున్న చిత్రం హుషారు... ఒక కొత్త సెన్సేషనల్ మ్యూజికల్ గా కొత్త ఒరవడి సృస్టించబోతోందని నిర్మాత బెక్కం వేనుగోపాల్ గారు తెలిపారు..

హుషారు సినిమాలో తేజస్ కంచర్ల, తేజ్ కురపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నగరాకర్, ప్రియ వడ్లమని, హేమ ఇంగ్లే నటించారు... శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.
మేం వయసుకు వచ్చాం, ప్రేమ-ఇష్క్-కాదల్, సినిమా చుపిస్త మామ, నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్, నేను లోకల్ (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) లాంటి మంచి నిర్మాణాత్మక విలువలు తెలిసిన బెక్కం వేణుగోపాల్ (గోపి) ఈ సినిమాని నిర్మించారు.. ఈ హుషారు సినిమా యూత్ అందరిని ఆకర్షించే చిత్రమని, ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందని తెలిపారు...


Click it and Unblock the Notifications











