For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలీవుడ్ 'ఛత్రపతి'కి దారుణమైన నష్టాలు.. షూటింగ్ మొదలవ్వక ముందే భారీ దెబ్బ!

  |

  ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో వరుసగా డిజాస్టర్స్ అందుకున్నాడు అంటే ఎదో ఒక విధంగా అతని మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం అలా కాకుండా సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకోవడం సాహసమనే చెప్పాలి. కొన్నిసార్లు కమర్షియల్ గా క్లిక్కయినపుడు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కానీ మరికొన్ని సార్లు రిజల్ట్ లో తేడా కొడితే ఊహించని దెబ్బ పడుతోంది. ఇక ఇప్పుడైతే సినిమా షూటింగ్ మొదలవ్వకముందే మూడు కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది.

  బెల్లంకొండ ఏ మాత్రం తగ్గడం లేదు.

  బెల్లంకొండ ఏ మాత్రం తగ్గడం లేదు.

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు శ్రీను కోసం బెల్లంకొండ సురేష్ పెట్టిన బడ్జెట్ అప్పట్లో అందరిని షాక్ కు గురి చేసింది. కొండమీద కోతిని కూడా తేవడానికి సిద్ధమే అనేలా కథనాలు వచ్చాయి. ఆ సినిమాకు వివి.వినాయక్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బెల్లంకొండ ఏ మాత్రం తగ్గడం లేదు.

  ఆ హిట్టుతో ఫుల్ జోష్..

  ఆ హిట్టుతో ఫుల్ జోష్..

  ప్రతి సినిమాకు కూడా దాదాపు స్టార్ హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక చాలా రోజుల అనంతరం రాక్షసుడు సినిమాతో మొత్తానికి ఒక పర్ఫెక్ట్ హిట్ అందుకోవడంతో ఫుల్ జోష్ లోకి వచ్చేశాడు. అంతకుముందే బెల్లంకొండ సినిమాలు కొన్ని హిందీలో డబ్ అయ్యి వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడంతో ఏకంగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు.

  ఛత్రపతి కోసం విలేజ్ సెట్..

  ఛత్రపతి కోసం విలేజ్ సెట్..

  ఇక మళ్ళీ బాలీవుడ్ ఎంట్రీని కూడా వినాయక్ చేతిలోనే పెట్టేశారు. రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి తెలుగులో ఏ రేంజ్ లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి హిట్టు కథను సరికొత్తగా తెరకెక్కించాలని ఫుల్ స్క్రిప్ట్ తో సిద్ధమయ్యారు. ఈ ఏప్రిల్ లో స్టార్ట్ చేయాలని హైదరాబాద్ లోనే ఒక విలేజ్ సెట్ వేశారు. ఇంతకుముందు రంగస్థలం సెట్ కూడా అదే ప్రాంతంలో వేశారు.

  Vijay Devarakonda Birthday : టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా రికార్డు | Liger Teaser || Filmibeat Telugu
  అప్పుడే 3కోట్ల నష్టం..

  అప్పుడే 3కోట్ల నష్టం..

  ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా ఆ సెట్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. సగం గుడిసెలు కూడా కొట్టుకుపోయాయి. ఆ దెబ్బతో సినిమాకు దాదాపు 3కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు తన టీమ్ తో కలిసి మరోసారి సెట్ ను నిర్మించే పనిలో పడ్డారు. వీలైనంత వరకు అదే తరహాలో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయవచ్చని తెలుస్తోంది.

  English summary
  Bellamkonda Srinivas, on the other hand, said it was an adventure to expand his range of films. Collections sometimes come in handy when clicked as a commercial. But a few more times the difference in the result is an unexpected blow. Now, before the film started shooting, it had to lose Rs 3 crore
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X