టాలీవుడ్‌కు మరో సినీ వారసుడు.. స్వాతిముత్యం‌గా బెల్లంకొండ బ్రదర్

సినిమా ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి హిట్స్ అందుకోవాలనే అడుగులు వేస్తున్నాడు. ప్రభాస్ చత్రపతి సినిమా కథను వివి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక అన్నయ్య అక్కడ ఉండగా తమ్ముడు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అవుతున్నాడు. కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ ను కూడా విడుదల చేశారు. ఒకవైపు అన్నయ్య మాస్ సినిమాలతో క్రేజ్ అందుకుంటే బెల్లంకొండ గణేష్ మాత్రం మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేశాడు అనిపిస్తోంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు 'గణేష్' తన మొదటి సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ లో చేస్తున్నాడు. యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'స్వాతిముత్యం' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కథానాయకుడు గణేష్ భుజాన బ్యాగ్ వేసుకొని కూల్ గా కనిపిస్తున్నాడు. ఆకర్షణీయమైన లోగో తో కూడిన టైటిల్ కూడా కనిపిస్తుంది. ఇక ఇదేరోజు బెల్లంకొండ గణేష్ పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ నటుడికి బెస్ట్ విషెస్ ను కూడా అందించింది.

Bellamkonda ganesh Swathimuthyam First Look Poster,Still & matter

'వర్ష బొల్లమ్మ' ఈ సినిమాలో కధానాయికగా నటిస్తోంది. ఇక కొత్త దర్శకుడు లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ.. 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా కొనసాగింది అనేది అసలు పాయింట్. ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అనుకుంటున్నాను అని దర్శకుడు తెలియజేశాడు. ఇక ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

'స్వాతిముత్యం' చిత్రానికి
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ.లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X