న్యూ ఏజ్ హార్రర్ మిస్టరీ థ్రిల్లర్‌తో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. టీంలో ఎవరెవరున్నారంటే?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన గతంలో అదిరిపోయే సినిమాలు చేశారు. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన ఈయన మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఎప్పటిలాగా యాక్షన్ మూవీతో కాకుండా... ఈసారి సరికొత్త జోనర్ తో రాబోతున్నారు. ముఖ్యంగా న్యూ ఏజ్ హార్రర్ మిస్టరీ థ్రిల్లర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లుడు సీను సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. భారీ బడ్జెట్లతోనే ఆయన సినిమాలన్నీ రూపొందాయి. స్టార్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు. స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్.. సినిమాల్లో నటించాడు. స్టార్ హీరోయిన్లు కూడా ఈయన సినిమాలో ఐటమ్ సాంగ్స్ చేసి. ప్లాపులు వచ్చినా మాస్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ మంచి పేరే తెచ్చుకున్నారు.

రాక్షసుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పింటిన ఈయన... చివరగా అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకులను ఫుల్లుగా డిసపాయింట్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోతానని చెప్పిన ఆయన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా కూడా అక్కడ పెద్దగా ఆడకపోవడంతో.. సైలెంట్ అయిపోయాడు. కానీ తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటిలాగా కాకుండా ఈ సారి సరికొత్త జోనర్ లో సినిమా చేయబోతున్నాడు.
ముఖ్యంగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో.. న్యూ ఏజ్ హార్రర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి బీఎస్11 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఎందుకుంటే ఈయనకు ఈ సినిమా 11వది. అందుతే BSS11 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు బీ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా.. చిన్మయి సాలాస్కర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అంతేకాకుండా నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా పని చేయబోతున్నారు.

షైన్ స్క్రీన్స్ పతాకంపై నిర్మించబోతున్న ఈ న్యూ ఏజ్ హార్రర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొత్త హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అంతా హార్రర్, థ్రిల్లర్ చిత్రాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. సినీ ప్రియులకు ఇష్టానుగుణంగా చిత్రాలు రూపొందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్ లో హిట్ కొట్టబోతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











