కొత్త లుక్‌లోకి మారిన యంగ్ హీరో.. మరో హిట్ కొట్టేందుకు రెడీ

బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఎట్టకేలకు సరైన హిట్ కొట్టాడు. మాస్ మంత్రం జపిస్తూ వచ్చిన ఈ హీరోకు విజయమనేది ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మారింది. తనను తాను నిరూపించుకోవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉండగా.. చివరగా వచ్చిన రాక్షసుడు చిత్రంలో తన విజయదాహాన్ని తీర్చుకున్నాడు.

తమిళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బెల్లంకొండకు ఆశించిన విజయాన్ని ఇచ్చింది. ఈ మూవీ ఇచ్చిన బూస్ట్‌తో మరిన్ని వైవిధ్యమైన చిత్రాలను పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. త్వరలో చేయబోతోన్న ప్రాజెక్ట్ కోసం పూర్తిగా తన శరీరాకృతిని మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో ఇప్పటికే హల్చల్ చేస్తోంది.

Bellamkonda Sai sreenivas New Movie With Santhosh Srinivas Will Starts On 29th November

'కందిరీగ‌', 'ర‌భ‌స', 'హైప‌ర్‌' వంటి కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను ఓకే చేశాడు. న‌వంబ‌ర్ 29న హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప‌లువురు సినీ ప్రముఖులు హాజ‌ర‌వుతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్రక‌టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X