BSS10 Movie: భీమ్లా నాయక్ డైరెక్టర్‌తో బెల్లంకొండ.. పవన్ కల్యాణ్ పాత్రను రిపీట్ చేయబోతున్న హీరో!

భీమ్లా నాయక్ సినిమా డైరెక్టర్ సాగర్ కె చంద్ర గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2012లో అయ్యారే, నాలుగేళ్ల తర్వాత అంటే 2016లో అప్పట్లో ఒకడుండే ఆ తర్వాత ఆరేళ్లు గ్యాప్ తీసుకుని భీమ్లా నాయక్ సినిమాతో వచ్చాడు. పవన్ కల్యాణ్ అద్భుతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించిన సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈయన తాజాగా మరో సనిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈయన డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించబోతున్నారు.

గతేడాది జూన్ లో ఈ విషయాన్ని ప్రకటించగా.. సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత నుంచి ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ కూడా బయటకు రాలేదు. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు, టైటిల్ ఏంటనే విషయాలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. అయితే ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 Bellamkonda Sai Srinivas As Power Ful Police Officer Role in BSS10 Movie

14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు 10వ చిత్రం. ఈ క్రమంలోనే ఈ సినిమాకు BSS10 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే ఈ చిత్రానికి దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 3వ తేదీన అనౌన్స్ చేయబోతున్నారని కూడా టాక్ నడుస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోను పవన్ కల్యాణ్ పాత్రతో రిపీట్ చేయబోతున్నట్లు నేరుగా డైరెక్టర్ యే ప్రకటించారు.

BSS10 సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే సినిమాలో భాగంగా డీఎస్పీగా ఆయనను తెలంగాణకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు ఓ ఆఫర్ లెటర్ ను క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రస్తుతం ఈ ఆఫర్ లెటర్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీసినట్లుగానే.. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా మెస్మరైజ్ చేయబోతున్నారు.

 Bellamkonda Sai Srinivas As Power Ful Police Officer Role in BSS10 Movie

బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ముకేశ్ గణేష్ ఛాయగ్రహకుడిగా పని చేయబోతుండగా.. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. చూడాలి మరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X