Chatrapathi Hindi Teaser రాజమౌళి కంటే భిన్నంగా వినాయక్ స్టైల్.. బెల్లంకొండ శ్రీను ఎలా చేశాడంటే?
టాలీవుడ్ లో కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో తనని తాను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలోకి తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఛత్రపతి సినిమాని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు.
వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని మే 12న రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థ అయిన పెన్ స్టూడియోస్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇక హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు ఎక్కువ మంది చూడటానికి కారణం ఆయన మూవీస్ లో యాక్షన్ సీక్వెన్స్ అనే సంగతి అందరికి తెలిసిందే. వాటికోసమే యుట్యూబ్ లో విపరీతంగా చూస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో ఛత్రపతి సినిమాని టీజర్ ని కూడా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తోనే డిజైన్ చేయడం విశేషం.
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఫ్రేమ్ లో యాక్షన్ మోడ్ లోనే బెల్లంకొండ శ్రీనివాస్ ని దర్శకుడు వివి వినాయక్ ఎస్టాబ్లిష్ చేయడం విశేషం. మాస్ కమర్షియల్ హీరోయిక్ కథలకి ఈ మధ్యకాలంలో హిందీ ఆడియన్స్ పట్టం కడుతున్న నేపధ్యంలో ఈ ఛత్రపతి సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఒక విధంగా వినాయక్ రాజమౌళి స్టైల్ కంటే భిన్నంగా ఇందులో యాక్షన్ పార్ట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

యాక్షన్ ఎలిమెంట్స్ ని గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసే విధంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. టీజర్ లో ఎక్కడా కూడా హీరోయిన్ ని చూపించలేదు. ఇక కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉంటుంది అనేది టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. ఇక మాస్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఆశ్వాదించే అంశాలు అన్ని కూడా పుష్కలంగా మూవీలో ఉంటాయని ఈ టీజర్ తో స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











