త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి!
'రాక్షసుడు' సినిమాతో విజయం అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో అభిమానులకు శుభవార్త చెప్పబోతున్నాడు. వీలైనంత త్వరగా అతడికి పెళ్లి చేసేందుకు ఇంట్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ విషయాన్ని శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ స్పష్టం చేశారు.
'రాక్షసుడు' చిత్రం భారీ విజయం అందుకున్న నేపథ్యంలో తన కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి సురేష్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొందరు మీడియా వారు శ్రీనివాస్ పెళ్లి ఎప్పుడు ప్రస్తావన తెచ్చారు. దీనికి ఆయన రియాక్ట్ అవుతూ 'ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాం, త్వరలోనే మీకు శుభవార్త చెబుతాను' అని బదులిచ్చారు.

శ్రీనివాస్‌కు ఇండస్ట్రీ నుంచే అమ్మాయిని చూస్తున్నారా? అంటూ కొందరు విలేకరులు ప్రశ్నించగా... 'చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి కాకుండా బయట నుంచి మా వాడికి తగిన అమ్మాయి కోసం సెర్చ్ చేస్తున్నాం.' అన్నారు. మీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరితోనైనా ప్రమలో ఉన్నారా? అనే ప్రశ్నకు అలాంటిదేమీ లేదని బెల్లంకొండ శ్రీనివాస్ రిప్లై ఇచ్చారు.
'రాక్షసుడు' సినిమా విషయానికొస్తే... తమిళంలో సూపర్ హిట్టైన 'రాచ్చసన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహించాగా, కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.


Click it and Unblock the Notifications











