‘రాక్షసుడు’ థియేటర్లలోకి వచ్చే డేట్ ఫిక్స్... న్యూ పోస్టర్ ఇదే!
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం రాక్షసుడు. ఏ స్టూడియోస్ బ్యానర్‌పై హవీశ్ ప్రొడక్షన్‌లో రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది.
పలు సార్లు వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ చేశారు. ఆగస్టు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు చిత్ర బృందం రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసింది. థియేటర్ల సమస్య కారణంగా ఇంతకాలం విడుదల జాప్యం అయినట్లు తెలుస్తోంది.

'రాక్షసుడు చిత్రం షూటింగ్ గ్యాప్ లేకుండా 85రోజులు, 110 కాల్ షీట్లతో పూర్తి చేసినా విడుదల విషయంలో మాత్రం చాలా జాప్యం జరిగింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 2న ఈ సినిమాతో పాటు గుణ 369, రణరంగం చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.


Click it and Unblock the Notifications











