కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ రిలీజ్ డేట్ ఖరారు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న 'కవచం' రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ 9 మిలియన్ డిజిటల్ వ్యూస్‌తో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెకకుతున్న ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మెహ్రీన్, హర్షవర్ధన్ రాణె, బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, అపూర్వ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

పాటలు మినహా ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న ఈ సినిమాని నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు
దర్శకత్వం: శ్రనివాస్ మామిళ్ల
నిర్మాత: నవీన్ చౌదరి సొంటినేని
నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్
సహ నిర్మాత: చాగంటి సంతయ్యా
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు
ఎడిటిర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్: చిన్నా


Click it and Unblock the Notifications











