మరో సినిమా లైన్లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్!
వరుస సినిమాలు చేస్తున్నా బెల్లంకొండ శ్రీనివాస్ కు సరైన విజయం దక్కడం లేదు. క్రేజీ కాంబినేషన్లు సెట్ అవుతున్నా ఈ హీరోకు విజయం మాత్రం దూరంగానే ఉంటోంది. ఈ ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తేజ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాని ప్రకటించాడు. అభిషేక్ అగర్వాల్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

పూర్తిస్థాయి ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శత్వంలో వహించబోతున్నారు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. వరుస చిత్రాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ కు ఊపునిచ్చే సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.


Click it and Unblock the Notifications











