సక్సెస్ కోసం ‘రాక్షసుడు’గా మారిన బెల్లంకొండ శ్రీను

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి. తాజాగా కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో హవీష్ కోనేరు, కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రాక్షసుడు చిత్రం రూపొందుతున్నది. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగానిర్మాత హ‌వీష్ కొనేరు మాట్లాడుతూ.. త‌మిళంలో సూప‌ర్‌డూప‌ర్‌ హిట్ అయిన రాక్ష‌స‌న్ చిత్రాన్ని తెలుగులో మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. ఈ చిత్రాన్ని ర‌మేష్‌వ‌ర్మ‌గారు డైరెక్ట్ చేస్తున్నారు. మేకింగ్ లో కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోన్నాం. బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్‌గా పరిచయం అవుతున్నారు. ఇప్పటి వరకు 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈద్ 2019లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Bellamkonda Srinivas as Rakshasudu

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ గట్టి హిట్టు కొట్టేందుకు బలమైన సబ్జెక్ట్‌తో రీమేక్‌ను ఎంచుకోవడం సానుకూలత వ్యక్తమవుతున్నది. రాక్షసుడుతో సక్సెస్ అందుకోవచ్చనే మాట వినిపిస్తున్నది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X